వాళ్ల నిజ స్వరూపాలు నాకు తెలుసు చెబితే షాక్ అవుతారు.. దుమారం రేపుతున్న రాధికా ఆప్టే కామెంట్స్ (వీడియో)

by Mallepaka Hamsa |

హాట్ బ్యూటీ రాధికా ఆప్టే (Radhika Apte)బోల్డ్ పాత్రలతో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

వాళ్ల నిజ స్వరూపాలు నాకు తెలుసు చెబితే షాక్ అవుతారు.. దుమారం రేపుతున్న రాధికా ఆప్టే కామెంట్స్ (వీడియో)
X

దిశ, సినిమా: హాట్ బ్యూటీ రాధికా ఆప్టే (Radhika Apte)బోల్డ్ పాత్రలతో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసి తన నటనతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. మరాఠీ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రయోగాత్మక నాటకాలలో నటించి తన నటనతో అందరినీ మంత్రముగ్దులను చేసింది. చాలెంజింగ్ పాత్రల్లో నటించిన రాధికా వెబ్ సిరీస్‌లతో అందరినీ ఆశ్చర్యపరిచింది. గత ఏడాది ‘సాలీ మొహబ్బత్’ (Saali Mohabbat)అనే మిస్టరీ థ్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించింది. ఇదిలా ఉంటే.. ఈక్రమంలో.. తాజాగా, సినీ ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధికా షాకింగ్ కామెంట్స్ చేసింది. తన కెరీర్ ప్రారంభ దశలో జరిగిన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను దక్షిణాది సినిమాల్లో నటించాల్సి వచ్చిందని, అప్పట్లో డబ్బు అవసరం కోసమే కొన్ని చిత్రాల్లో తప్పక గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెప్పింది. ‘‘మారుమూల ప్రాంతాల్లో షూటింగ్ జరిగేటప్పుడు సెట్‌లో నేను మాత్రమే మహిళగా ఉండేదాన్ని. ఆ సమయంలో వ్యక్తిగత సిబ్బందిని కూడా లోపలికి అనుమతించకుండా ఆంక్షలు పెట్టేవారు. సెట్‌లో మహిళల శరీరం గురించి అసభ్యకరమైన జోకులు వేయడం, చెస్ట్ ప్యాడింగ్ వాడాలని ఒత్తిడి చేయడం వంటి సంఘటనలు నన్ను అసౌకర్యానికి గురి చేశాయి. నేను సాధారణంగా చాలా ధైర్యంగా ఉంటాను. కానీ ఆ రోజులను గుర్తు చేసుకుంటే.. ఇప్పటికీ నా గుండె భయంతో వేగంగా కొట్టుకుంటుంది. ఆ సెట్స్‌లో ఎదురైన అనుభవాలు నన్ను తీవ్రంగా కలచివేశాయి.

ఏ నటికైనా అలాంటి పరిస్థితులు ఎదురుకాకూడదు’’ అని ఎమోషనల్ అయింది. అలాగే బాలీవుడ్ కొందరు వ్యక్తులు చాలా డేంజర్ అని చెప్తూ అందరినీ షాక్‌కు గురి చేసింది. ‘‘బాలీవుడ్‌లో నాకు వచ్చిన కొన్ని ఆఫర్ల సందర్భంగా నేను కొందరిని కలిశాను. వారితో మాట్లాడిన తర్వాత ఇక జీవితంలో మళ్లీ వారిని కలవకూడదని నిర్ణయించుకున్నాను. వాళ్లు చాలా పేరున్న వ్యక్తులు. వారి పేర్లు చెబితే అందరూ షాకవుతారు” అని చెప్పుకొచ్చింది.కానీ వాళ్ల పేర్లను మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం రాధిక ఆప్టే చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

link

Next Story