ఎలాంటి సమాజంలో జీవిస్తున్నామో ఇప్పుడే అర్థమైంది.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ చాందినీ చౌదరి పోస్ట్

by Mallepaka Hamsa |

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుని నటనపై ఆసక్తితో హీరోయిన్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతోంది చాందినీ చౌదరి(Chandini Chowdhury).

ఎలాంటి సమాజంలో జీవిస్తున్నామో ఇప్పుడే అర్థమైంది.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ చాందినీ చౌదరి పోస్ట్
X

దిశ, సినిమా: షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుని నటనపై ఆసక్తితో హీరోయిన్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతోంది చాందినీ చౌదరి(Chandini Chowdhury). ‘కలర్ ఫొటో’ చిత్రంలో వచ్చి మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అప్పటినుంచి పలు చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ‘సంతాన ప్రాప్తిరస్తు’ (Santhana Prapthirasthu)సినిమాతో బిజీగా ఉంది. ఈ మూవీ నేడు గ్రాండ్‌గా విడుదలై.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, చాందినీ చౌదరి సోషల్ మీడియా ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఓ కార్ షోరూం వద్ద కొందరు వీధి కుక్కలను పట్టుకుని తీసుకువెళుతున్నారు. అయితే ఆ కుక్కను బంధించి ట్రాలీలో ఎక్కిస్తున్న క్రమంలో దాన్ని కింద నుంచి పైకి విసురుతున్నట్లుగా ఉంది. అందులో పట్టకపోవడంతో కుక్క కిందపడిపోతుంది.

బ్రతికి ఉన్న కుక్కను వస్తువులా ట్రీట్ చేస్తూ నిర్లక్ష్యంగా దాన్ని పైకి విసరడం చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ ఫైర్ అయింది. ‘‘నోరులేని జీవాల పట్ల ఇంతటి అమానుషమా. అవి కూడా మనలాగే ప్రాణులనే విషయాన్ని చాలామంది మర్చిపోయారు. వాటిని అలా విసరడం ఎంత ఘోరమైన చర్య. వాటికి హాని కలుగుతుందనే కనీస ఆలోచన లేకుండా విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. కనీసం జంతువుల పట్ల జాలీ, దయలేని సమాజంలో మనం జీవిస్తున్నాం అని ఈ సంఘటతో అర్థమైంది’’ అని రాసుకొచ్చింది.

ఇక ఈ ఘటన విశాఖపట్నంలోని వరుణ్ మోటార్ ముందు జరిగినట్లు తెలపడంతో పాటు మున్సిపాలిటి అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు కొందరు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తుంటే.. మరికొందరు మాత్రం కార్లలో తిరిగే మీకేం తెలుసు. వీధి కుక్కల వల్ల జనాలకు ఎంత హాని జరుగుతుందో అని ఫైర్ అవుతున్నారు. వాటి కారణంగా బాటసారులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదం బారిన పడుతున్నారంటూ కామెంట్లు చేస్తూ చాందిని ట్రోల్ చేస్తున్నారు.

Next Story