పిల్లలను కనాలనే ఆలోచనే లేదు.. సంచలన ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్

by Mallepaka Hamsa |

ఇటీవల కాలంలో సమాజంలో ఆలోచనలు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు పెళ్లయ్యాక వెంటనే పిల్లలు ఉండాలనే భావన బలంగా ఉండేది.

పిల్లలను కనాలనే ఆలోచనే లేదు.. సంచలన ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్
X

దిశ, సినిమా: ఇటీవల కాలంలో సమాజంలో ఆలోచనలు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు పెళ్లయ్యాక వెంటనే పిల్లలు ఉండాలనే భావన బలంగా ఉండేది. కానీ ఇప్పుడు సామాన్యులే కాదు, సెలబ్రిటీలు కూడా పిల్లలను కనడంపై తొందరపడటం లేదు. కెరీర్, వ్యక్తిగత స్వేచ్ఛ, మానసిక ప్రశాంతత వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ కొంత గ్యాప్ తీసుకుంటున్నారు. కొందరైతే పెళ్లి జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో పిల్లల ప్లాన్‌ను వాయిదా వేసుకుంటున్నారు. అయితే ఈ ట్రెండ్‌కు భిన్నంగా ఓ స్టార్ హీరోయిన్ మాత్రం మరింత బోల్డ్‌గా స్పందించింది. పిల్లలను కనే ఆలోచనే తనకు లేదంటూ స్పష్టంగా చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar)ఈ విషయంలో తన అభిప్రాయాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా వెల్లడించింది. “అమ్మతనం అనేది చాలా పెద్ద బాధ్యత. పిల్లల్ని కన్నంత మాత్రాన తల్లి అయిపోలేరు” అంటూ ఆమె చెప్పిన మాటలు అందరి దృష్టిని ఆకర్షించాయి. తల్లి అనేది కేవలం జన్మనివ్వడమే కాదని, ప్రేమ, బాధ్యత, త్యాగం ఉండాలన్నదే నిజమైన అమ్మతనం అని ఆమె అభిప్రాయపడింది.

తాను తన చెల్లికి తల్లిలా ఉంటానని, అలాగే తన పెంపుడు కుక్కలను కూడా పిల్లలాగే చూసుకుంటానని వరలక్ష్మీ చెప్పింది. తన స్నేహితులను, అవసరంలో ఉన్నవారిని కూడా తల్లిలా ఆదుకుంటానని తెలిపింది. సహాయం అవసరమైనవారికి తోడుగా నిలవడమే తన దృష్టిలో అమ్మతనం అని వివరించింది. ఈ మాటలతో ఆమె భావోద్వేగంగా మాట్లాడిందని తెలుస్తోంది. అయితే పిల్లలను కనడం విషయంలో మాత్రం తాను స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నానని వరలక్ష్మీ చెప్పింది. వ్యక్తిగతంగా తనకు పిల్లల్ని కనాలనే ఆలోచన లేదని వెల్లడించింది. అయితే భవిష్యత్తులో పరిస్థితులు మారవచ్చని కూడా కొట్టిపారేయలేమని పేర్కొంది. ఒకప్పుడు తాను పెళ్లి చేసుకోనని అనుకున్నానని, కానీ కాలక్రమంలో ఆ ఆలోచన మారిందని ఉదాహరణగా చెప్పింది.

ఇప్పటి తరంలో చాలామంది పిల్లలను కనకూడదని నిర్ణయం తీసుకుంటున్నారని, అది తప్పు కాదని వరలక్ష్మీ అభిప్రాయపడింది. అలాంటి నిర్ణయం తీసుకునేవాళ్లు ఆలోచించి, బాధ్యతతోనే ఆ నిర్ణయం తీసుకుంటారని చెప్పింది. సమాజం అలాంటి వ్యక్తుల నిర్ణయాలను గౌరవించాలని సూచించింది. కాగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ గత ఏడాది నికోలాయ్ సచ్‌దేవ్‌(Nikolai Sachdev)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంతకు ముందే అతనికి పెళ్లై అయి ఓ కూతురు కూడా ఉండటం గమనార్హం. నికోలాయ్ మొదటి భార్యతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని వరలక్ష్మీని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.

Next Story