- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎవరి కోసమో నేను మారే ప్రసక్తి లేదు.. ట్రోల్ చేసుకుంటే చేసుకోండంటూ నరేష్ సెన్సేషనల్ కామెంట్స్
నేను నా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. సినిమా కోసం కష్టపడతాను, కెమెరా ముందు నటిస్తాను. కానీ కెమెరా వెనుక నా ప్రైవసీ నాది.

దిశ, సినిమా: సీనియర్ నటుడు వీకే నరేష్ (VK Naresh)ఇప్పుడు టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ జాతర కొనసాగిస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన, తాజాగా ‘హే బలవంత్’(hey balawanth)ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గత కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ట్రోల్స్‌కు ఆయన ఈ వేదిక ద్వారా గట్టిగా సమాధానం ఇచ్చారు. సాధారణంగా సెలబ్రిటీలు ట్రోల్స్ వస్తే సైలెంట్‌గా ఉంటారు లేదా వివరణ ఇచ్చుకుంటారు. కానీ నరేష్ రూటే సెపరేట్ తనదైన స్టైల్లో ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చారు. ‘‘నా జీవితం నా ఇష్టం. నేను ఎలా బతకాలి, ఏం మాట్లాడాలి అనేది నా వ్యక్తిగత విషయం.
మీకు నచ్చితే సినిమా చూడండి, నచ్చకపోతే ట్రోల్స్ వేసుకోండి. వాటి వల్ల నాకేం నష్టం లేదు, నాకేం పోదు’’ అంటూ రెచ్చిపోయారు. ట్రోల్స్ వల్ల తనపై ఎలాంటి నెగెటివ్ ఇంపాక్ట్ పడదని, తాను మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరి కోసమో తన మనస్తత్వాన్ని లేదా జీవనశైలిని మార్చుకోలేనని ఆయన తేల్చి చెప్పారు. ‘‘నేను నా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. సినిమా కోసం కష్టపడతాను, కెమెరా ముందు నటిస్తాను. కానీ కెమెరా వెనుక నా ప్రైవసీ నాది" అని పేర్కొన్నారు. ఇటీవలే తన 54వ పుట్టినరోజు వేడుకలను పవిత్ర లోకేష్‌తో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న నరేష్, విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు.
హీరో సుహాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్లలో నరేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవ్వడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు ఆయన ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం సీనియర్ నటుడిగా కాస్త హుందాతనం ప్రదర్శించాలని సూచిస్తున్నారు. అలాగే కాస్త తగ్గి నడుచుకుంటే మంచిదని ఇలా మాట్లాడిన వారెందరో క్షమాపణలు కూడా చెప్పారని గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా, తనపై వచ్చే నెగెటివిటీని పాజిటివిటీగా మార్చుకుంటూ, అటు సినిమాల్లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ నరేష్ తనదైన ముద్ర వేస్తున్నారు.






