అతనిలో ఉన్న ఎనర్జీ నేనెక్కడా చూడలేదు.. స్టార్ హీరోపై రాశీ ఖన్నా ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-21 14:49:02  IST  )

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశీఖన్నా(Raashi Khanna) వరుస సినిమాలతో దూసుకుపోతూ ఇండస్ట్రీలో రాణిస్తోంది.

అతనిలో ఉన్న ఎనర్జీ నేనెక్కడా చూడలేదు.. స్టార్ హీరోపై రాశీ ఖన్నా ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ రాశీఖన్నా(Raashi Khanna) వరుస సినిమాలతో దూసుకుపోతూ ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇటీవల ‘తెలుసు కదా’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ భామ త్వరలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో రాబోతుంది. పవర్ స్టార్, హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఈనేపథ్యంలో.. రాశీఖన్నా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికర కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

తాజాగా, రాశీఖన్నా టాలీవుడ్ హీరోపై ప్రశంసలు కురిపించింది. ‘‘ఎన్టీఆర్ (NTR)యాక్టింగ్ విషయంలో చాలా ఫ్యాషన్‌గా ఉంటారు. అతనిలో ఉన్న ఎనర్జీని నేనెక్కడా చూడలేదు. ఎన్టీఆర్ అంత ఎనర్జీటిక్‌గా ఎవరూ ఉండరు. అతనిని చూసి నేను కూడా చాలా స్ఫూర్తి పొందాను. నేనెప్పుడూ ఒక విషయాన్ని చెప్తుంటారు. మీరు ఎనర్జీ డ్రింక్ ఏదైనా తాగుతారా? అని అంటాను. ఎందుకంటే మీరు చాలా ఎనర్జీగా ఉంటారు కదా అని చెప్పాను. ఎన్టీఆర్ పది పెజీల డైలాగులను కూడా అలవోకగా చెప్పేస్తారు. తెలుగులో చాలా బాగా మాట్లాడతారు. అతని డైలాగ్ డెలివరీ ఎంతగానో నచ్చుతుంది. అతన్ని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story