- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇలాంటి అబ్బాయిని నేనెప్పుడూ చూడలేదు.. నా కోసం అన్ని వదులుకున్నాడు: సందీప్ కిషన్
దళపతి విజయ్ (Thalapathy Vijay)తనయుడు జాసన్ సంజయ్(Jason Sanjay) దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు.

దిశ, సినిమా: దళపతి విజయ్ (Thalapathy Vijay)తనయుడు జాసన్ సంజయ్(Jason Sanjay) దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. సందీప్ కిషన్(Sundeep Kishan), జాసన్ కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా ‘సిగ్మా’ (Sigma)టైటిల్‌తో రాబోతుండగా.. ఫస్ట్ లుక్ కూడా విడుదలై ఆసక్తిని పెంచింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ కిషన్ ‘‘తమిళ రాష్ట్రానికి సినిమా వారసుడు తనే. ఆ రేంజ్‌లో అక్కడ ఇంకో వారసుడు లేడు. జాసన్ అనుకుంటే ఏమైనా వస్తుంది.స్టార్ డైరెక్టర్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌తో ఫస్ట్ టైం డెబ్యూ హీరోగా సినిమా సెట్ చేసుకోవచ్చు. కానీ అతను నాకు ఇవేమి వద్దు. నేను డైరెక్షన్ చేయాలి, నాకు సందీపే కావాలి అన్నాడు. ప్రతిరోజు సెట్‌లో అతని వర్క్ చూస్తాను. విజయ్ ఫ్యాన్స్ ఎంతమంది నా సినిమా చూస్తారు ఇవన్నీ సెకండరీ. ఒక 24 ఏళ్ళు ఉన్న ఇలాంటి అబ్బాయిని నేను ఎప్పుడూ కలవలేదు. ఏమి లేకుండానే సక్సెస్ తెచ్చుకుంటానని రెడీ అయ్యాడు. అతని కోసం సినిమా చేయొచ్చు అనిపించింది. అందుకే ఒప్పుకున్నా’’ అని చెప్పుకొచ్చాడు.






