చేదు అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకున్నా.. ఈసారి ఆ తప్పు జరగదు: డింపుల్ హయాతీ

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ బ్యూటీ డింపుల్ హయాతి (Dimple Hayathi)తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపే తెచ్చుకుంది

చేదు అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకున్నా.. ఈసారి ఆ తప్పు జరగదు: డింపుల్ హయాతీ
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ డింపుల్ హయాతి (Dimple Hayathi)తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపే తెచ్చుకుంది. గ్లామర్‌తో పాటు నటనలోనూ తనదైన మార్క్ వేయాలనుకున్నప్పటికీ… ఆశించిన స్థాయిలో స్టార్‌డమ్ మాత్రం అందుకోలేకపోయింది. చేసింది కొద్ది సినిమాలే అయినా, అవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో ఆమె కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా డౌన్ అయింది. దీంతో ఇండస్ట్రీలో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ముఖ్యంగా తెలుగులో ఆమె నటించిన ఖిలాడీ, రామబాణం సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడం డింపుల్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. వరుస ఫ్లాప్‌ల ప్రభావంతో ఆమె దాదాపు రెండేళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ గ్యాప్‌లో తనపై వస్తున్న విమర్శలను మౌనంగా భరిస్తూ, సరైన అవకాశానికోసం ఎదురుచూసినట్టే కనిపించింది. ఇప్పుడు అదే మౌనం బ్రేక్ చేస్తూ డింపుల్ హయాతి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘రవితేజ-ఇలియానా జోడీగా చేసిన ‘ఖతర్నాక్’ ఆశించిన ఫలితం ఇవ్వలేదు.

మళ్లీ అదే జోడీ రెండోసారి ‘కిక్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నారు. అలాగే రవితేజ(Ravi Teja)గారు, నేను కలిసి చేసిన మా మొదటి మూవీ ‘ఖిలాడి’ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. కథ పరంగా కొన్ని లోపాలు ఉన్నాయి అందుకే ఆ సినిమా నిరాశపరిచింది. ఆ అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకున్నాను. ఈసారి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’(Bhartha Mahasayulaku Wignyapthi) సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను. ఈ చిత్రంలో కథకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, నా పాత్రకు పూర్తి న్యాయం జరిగేలా దర్శకుడు చూపించిన శ్రద్ధ నన్ను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా నా పాత్రలో భావోద్వేగాలు, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ బ్యాలెన్స్‌గా ఉండటం వల్ల ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని ఆశిస్తున్నాను. గత సినిమా లోపాలను ఈసారి రిపీట్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఈ సారి తప్పు జరగకుంటా చూసుకున్నా.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ హిట్ అందుకంటామని నమ్ముతున్నాను’’ అని చెప్పుకొచ్చింది.

Next Story