- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాకు ఆమెతో పెళ్లై చాలా ఏళ్లు అవుతోంది.. కానీ పిల్లలు లేరు.. వెంకటేష్ హీరోయిన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ నటుడు..
స్టార్ నటుడు నిర్మాత తరుణ్ అరోరా(Tarun Arora)కు పరిచయం అక్కర్లేదు. ఆయన పలు చిత్రాలో విలన్ పాత్రలు చేసి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు.

దిశ, సినిమా: స్టార్ నటుడు నిర్మాత తరుణ్ అరోరా(Tarun Arora)కు పరిచయం అక్కర్లేదు. ఆయన పలు చిత్రాలో విలన్ పాత్రలు చేసి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఎక్కువగా తరుణ్ తమిళ సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. అంతేకాకుండా పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కాటమరాయుడు, జయ జానకి నాయక, ఖైధీ నంబర్ 150, అమర్ అక్బర్ ఆంటోనీ(Amar Akbar Antony), సీటిమార్, రామబాణం, కాంచన-3, భోళా శంకర్(Bhola Shankar) వంటి మూవీస్ చేశారు. ప్రస్తుతం అడపా దడపా అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తరుణ్ అరోరా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘నాకు అంజలా(Anjala Zaveri)కి పెళ్లి జరిగి దాదాపు 20 ఏళ్లు అవుతోంది. మా మధ్య బంధం ఏర్పడినప్పటికీ పిల్లలను మాత్రం కనలేదు. ఎందుకంటే.. దానికి ఓ కారణం ఉంది. సాధారణంగా పెద్దలు కుదిర్చిన జంటల్లో ప్రేమ, బాండింగ్ పెరగడానికి పిల్లల్ని కంటూ ఉంటారు. కానీ మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు. నేను అంజలా ప్రేమించి వివాహం చేసుకున్నాము.
మా మధ్య ఎప్పటికీ ప్రేమ ఉంటుందని నమ్ముతాము కాబట్టి పిల్లలను కనాలని అనుకోలేదు. అంజలా జవేరి నాకు చిన్న పాపాయిలాగే అనిపిస్తుంది. అందుకే భవిష్యత్తులో పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకున్నాము’’ అని చెప్పుకొచ్చాడు. కాగా, అంజలి జావేరి టాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే తరుణ్‌తో ప్రేమలో పడింది. ఈ అమ్మడు వెంకటేష్ సరసన ప్రేమించుకుందాం రా, భలేవాడు, శంకర్ దాదా mbbs, సమర సింహా రెడ్డి, వంటి సినిమాలతో ఫేమ్ తెచ్చుకుంది. అలాగే బాలీవుడ్‌లోనూ పలు ప్రాజెక్ట్స్ చేసింది.






