- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను ‘వార్-2’ చేయడానికి ఓ బలమైన కారణం ఉంది.. ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) ‘వార్-2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) ‘వార్-2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హృతిక్ రోషన్(Hrithik Roshan) ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారు. అయాన్ ముఖర్జీ(Ayan Mukherjee) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ‘వార్-2’ భారీ అంచనాల మధ్య ఆగస్టు 14 థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
‘‘వార్-2 కోసం భాషతో సంబంధం లేకుండా అందరూ కలిసి పని చేశారు. ఇకపై బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ అనేవి లేవు. భారతీయ చిత్ర పరిశ్రమగా గుర్తించాలి. ఇలా తీస్తే సినిమాలు హిట్ అవుతాయని ప్రత్యేమైన ఫార్ములాలు ఏవీ ఉండవు. ఇంతకు ముందు నాకు రాజమౌళి నాతో అన్నారు. ఎంచుకున్న కథను ప్రేక్షకులకు నచ్చేలా చూపించాలి. నేను ‘వార్-2’ను అంగీకరించడానికి కారణం ఉంది. బలమైన కథతో దీనిని తెరకెక్కించారు. హృతిక్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా అనిపించింది’’ అని చెప్పుకొచ్చారు.






