నాకు సినిమాలే వద్దు అనుకున్నా.. ఆయన బలవంతం వల్లే హీరోయిన్ అయ్యా: మాళవిక నాయర్

by Mallepaka Hamsa |

చిన్నప్పుడు కొన్ని యాడ్స్‌లో కనిపించాను. ఆ ఫోటోలను చూసిన దర్శకుడు నాగ్ అశ్విన్ గారు ‘ఎవడే సుబ్రమణ్యం’లో అవకాశం ఇచ్చారు.

నాకు సినిమాలే వద్దు అనుకున్నా.. ఆయన బలవంతం వల్లే హీరోయిన్ అయ్యా: మాళవిక నాయర్
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే యంగ్ బ్యూటీ మాళవిక నాయర్, త్వరలో శర్వానంద్ సరసన ‘బైకర్’ చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతోంది. దాదాపు పదేళ్ల సినీ ప్రయాణంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఈ మలయాళ కుట్టి, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. చదువంటే అమితమైన ఇష్టం ఉన్న మాళవిక, నిజానికి ఒక ఆస్ట్రోనాట్ కావాలని కలలు కనిందట. కానీ, తన తండ్రి బలవంతం వల్లే సినిమాల్లోకి రావాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది. "చిన్నప్పుడు కొన్ని యాడ్స్‌లో కనిపించాను. ఆ ఫోటోలను చూసిన దర్శకుడు నాగ్ అశ్విన్ గారు ‘ఎవడే సుబ్రమణ్యం’లో అవకాశం ఇచ్చారు.

నాన్నకు ఆ కథ బాగా నచ్చడంతో నన్ను బలవంతంగా ఒప్పించారు. ఒకవేళ ఆ రోజు నేను ఆ ప్రాజెక్ట్ చేయకపోయుంటే, ఈ రోజు ఇంత మంచి గుర్తింపును కోల్పోయేదాన్ని" అని మాళవిక చెప్పుకొచ్చింది. నాగ్ అశ్విన్ తన ప్రతి సినిమాలోనూ మాళవికకు అవకాశం ఇస్తూ, ఆమెను తన ‘లక్కీ చార్మ్’ అని పిలుస్తుంటారని తెలిపింది. అంతేకాకుండా తన కెరీర్ ప్రారంభంలోనే ఓ కండీషన్ పెట్టుకున్నట్లు వెల్లడించింది. "మొదటి సినిమా హిట్ అయినప్పుడే ప్రతి కథకూ ఓకే చెప్పకుండా వైవిధ్యం ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నా, ఇప్పటికీ అదే పాటిస్తున్నా" అని ఆమె స్పష్టం చేసింది. తండ్రి ప్రోత్సాహంతో వెండితెరకు పరిచయమైన ఈ అందాల భామ, ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.

Next Story