- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదే విజయమని అపోహ పడ్డ.. రూ. 1000 కోట్ల సినిమాలు లేకున్నా సంతోషంగా ఉన్నా: సమంత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఓ సినిమా కూడా తెరకెక్కించగా.. అది ప్రేక్షకులను మెప్పించింది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఓ సినిమా కూడా తెరకెక్కించగా.. అది ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ‘మా బంగారు తల్లి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నేను విజయం అంటే గ్యాప్ లేకుండా సినిమాలు చేయడం అని నమ్మేదాన్ని. ఒక ఏడాదిలో నా ఐదు చిత్రాలు విడుదలైన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే విజయమని అపోహ పడ్డా. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేయాలి.. పెద్ద బ్లాక్ బస్టర్స్ అందుకోవాలని అనుకున్నా. అలాగే టాప్ 10 నటీనటుల జాబితాలో ఉండాలని భావించా. కానీ ఇప్పుడు నా ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. రెండేళ్లుగా సినిమాలు చేయలేదు.. అలాగే టాప్ 10 లిస్ట్‌లోనూ లేను. ఇప్పుడు నా దగ్గర రూ.1000 కోట్ల మూవీస్ లేనప్పటికీ నాకు ఉన్నంతలో సంతోషంగా బతుకుతున్నాను. గతంలో ఎప్పుడూ భయపడుతూ ఉండేదాన్ని. ఎందుకంటే అప్పుడు నా స్థానాన్ని భర్తీ చేస్తారేమో అని నంబర్లు క్యాలిక్యులేషన్స్ వేసుకుంటూ ఉండేదాన్ని. నా ఆత్మగౌరవం మొత్తం నంబర్ల మీదే ఉందనుకున్నా. కానీ ఇప్పుడు అలా ఆలోచించడం లేదు’’ అని చెప్పుకొచ్చింది.






