విజయ్ దేవరకొండ పక్కన చాన్స్ నాదే.. కానీ రష్మిక కొట్టేసిందంటూ ఐశ్వర్య అర్జున్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-07 05:18:55  IST  )

కొన్ని కారణాల వల్ల నేను ‘గీత గోవిందం’లో నటించే అవకాశాన్ని కోల్పోయాను. నా తర్వాత కూడా చాలా మంది హీరోయిన్ల వద్దకు ఈ ఆఫర్ వెళ్లిందని విన్నాను.

విజయ్ దేవరకొండ పక్కన చాన్స్ నాదే.. కానీ రష్మిక కొట్టేసిందంటూ ఐశ్వర్య అర్జున్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సెన్సేషనల్ హిట్లలో ఒకటైన ‘గీత గోవిందం’(Gita Govindam) సినిమా విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) -రష్మిక మందన్న(Rashmika Mandanna)ల కెరీర్‌ను ఏ స్థాయికి తీసుకెళ్లిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా రష్మికకు 'నేషనల్ క్రష్' ఇమేజ్‌ను తెచ్చిపెట్టడమే కాకుండా, వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి కారణమైంది. ఇటీవల ఫిబ్రవరి 26న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఐకానిక్ సినిమాలో ‘గీత’ పాత్ర కోసం రష్మిక మందన్న మొదటి ఛాయిస్ కాదన్న విషయం ఇప్పుడు బయటపడింది. యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘గీత గోవిందం’ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ‘‘కొన్ని కారణాల వల్ల నేను ‘గీత గోవిందం’లో నటించే అవకాశాన్ని కోల్పోయాను. నా తర్వాత కూడా చాలా మంది హీరోయిన్ల వద్దకు ఈ ఆఫర్ వెళ్లిందని విన్నాను.

నేను చేయలేకపోయినప్పటికీ, సినిమా మాత్రం అద్భుతంగా వచ్చింది. నేను వదులుకున్న చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాలు సాధించాయి’’ అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసి కొందరు షాక్ అవుతుంటే.. మరికొందరు మాత్రం మీరు చేయకపోవడమే మంచిది అయిందని అంటున్నారు. కాగా.. దర్శకుడు పరశురామ్ ఈ కథను సిద్ధం చేసుకున్నప్పుడు రష్మిక కంటే ముందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్లను సంప్రదించినట్లు సమాచారం. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి వంటి క్రేజీ హీరోయిన్లకు ఈ స్టోరీ వినిపించారట. అయితే అప్పట్లో వారు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ అడ్జస్ట్ కాక ఈ సినిమాకు ‘నో’ చెప్పారని టాక్. చివరకు ఈ లక్కీ ఛాన్స్ రష్మికను వరించింది. నిజంగానే సాయి పల్లవి లేదా రకుల్ ఈ పాత్ర చేసి ఉంటే గీత గోవిందం రిజల్ట్ ఎలా ఉండేదో చెప్పలేం కానీ, రష్మికకు మాత్రం ఈ సినిమా లైఫ్ ఇచ్చిందని చెప్పాలి. విజయ్-రష్మిక కెమిస్ట్రీ పండటంతో పాటు, వారిద్దరూ ఇప్పుడు నిజజీవితంలో కూడా ఒకటవ్వడం అభిమానులకు ఎంతో సంతోషాన్నిస్తోంది.

నీ భార్య బాధను ఇసుమంతైనా పట్టించుకోవా.. విజయ్, త్రిష రిలేషన్‌పై సనమ్ శెట్టి సంచలన పోస్ట్

Next Story