‘వానర’లో ఆ సీన్స్ చూసి చాలా ఎమోషనల్ అయ్యాను.. మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |

అవినాశ్ తిరువీధుల(Avinash Thiruveedhula) హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘వానర’(vaanara).

‘వానర’లో ఆ సీన్స్ చూసి చాలా ఎమోషనల్ అయ్యాను.. మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: అవినాశ్ తిరువీధుల(Avinash Thiruveedhula) హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘వానర’(vaanara). ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి(Simran Chowdhury) హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ‘వానర’ చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాశ్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న ‘వానర’ సినిమా మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు రాబోతోంది. వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది. తాజాగా, ‘వానర’ మూవీ టీజర్‌ను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ - ‘వానర’ చిత్రం టీజర్ లాంచ్‌కి గెస్ట్‌గా రావడం హ్యాపీగా ఉంది.

అవినాశ్ గురించి నాకు తెలుసు. చాలా కష్టపడే తత్వం ఉన్నవాడు. ఫస్ట్ సినిమాకే హీరోగా నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేశాడు. అది అంత సులువు కాదు. ఈ రోజు చిన్న సినిమా పెద్ద చిత్రం లేదు. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. బాగున్న ప్రతి మూవీ భాషలకు అతీతంగా ఇండియన్ సినిమా అయ్యింది. అవినాశ్ ఆయన టీమ్ కష్టపడి చేసిన ఈ మూవీ సక్సెస్ కావాలి. అవినాశ్, ఆయన టీమ్‌కు మంచి పేరు తీసుకురావాలి. అవినాశ్ ఫాదర్ హనుమంతరావు గారు హీరో కావాలని అనుకున్నారు కానీ పోలీస్ డిపార్ట్ మెంట్ లోకి వెళ్లారు. ఆయన తన కలను కొడుకు అవినాశ్ ద్వారా నిజం చేసుకున్నారు.

ఈ రోజు అవినాశ్‌ను చూసి హనుమంతరావు గారు గర్వపడుతున్నారు. సాయిమాధవ్ బుర్రా గారితో అహం బ్రహ్మాస్మి సినిమా చేయాలి. త్వరలో ఆ ప్రాజెక్ట్ ను కూడా ముందుకు తీసుకొస్తాం. ఈ చిత్రం చూశాను బాగా వచ్చింది. శివాజీ రాజా గారు చేసిన సీన్స్ చూసి ఎమోషనల్ అయ్యాను. సాయం చేసే ప్రతి ఒక్కరి హృదయంలో హనుమ ఉన్నారు. మ్యూజిక్ మీద నాకున్న ఇష్టంతోనే మోహన రాగ మ్యూజిక్ లేబుల్ స్టార్ట్ చేశాను’’ అన్నారు.

Next Story