‘త్రిబాణధారి బార్బరిక్’ విషయంలో ఆయనను చాలా కష్టపెట్టాను.. మోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

సత్య రాజ్(Satya Raj), ఉదయభాను(Udaya Bhanu), వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘త్రిబాణధారి బార్బరిక్’(Tribanadhari Barbarik).

‘త్రిబాణధారి బార్బరిక్’ విషయంలో ఆయనను చాలా కష్టపెట్టాను.. మోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: సత్య రాజ్(Satya Raj), ఉదయభాను(Udaya Bhanu), వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘త్రిబాణధారి బార్బరిక్’(Tribanadhari Barbarik). స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈ సినిమాకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆగస్టు 29న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో దర్శకుడు మోహన్ శ్రీవత్స చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ‘‘నేను కథల్ని బాగా చెప్పగలను. అద్భుతంగా నెరేషన్ ఇవ్వగలను. ఈ ‘బార్బరిక్’ కథను నిర్మాతకు చెప్పిన వెంటనే నచ్చింది. మారుతి గారు నా కథను విని ఆశ్చర్యపోయారు. నా నెరేషన్‌తోనే ఆయన నన్ను నమ్మేశారు. బార్బరికుడు సత్యరాజ్ త్రిబాణంతో కురుక్షేత్రంను ఆపగలరు. అలాంటి బార్బరికుడిని కృష్ణుడు ఓ వరం అడిగి యుద్దాన్ని జరిగేలా చేస్తారు.

నార్త్‌లో బార్బరికుడు ఫాలోయింగ్ చాలా ఉంటుంది. సత్య రాజ్ గారు బార్బరికుడిలా కొన్ని చోట్ల కనిపిస్తారు. మేకప్‌ విషయంలో ఆయనను చాలా కష్టపెట్టాను. ‘బార్బరిక్’ చిత్రంలో హీరో, విలన్ అని ఉండరు. అన్ని పాత్రల్లో అన్ని యాంగిల్స్ ఉంటాయి. అన్ని పాత్రల్లోనూ అంతర్గిక యుద్దం జరుగుతుంటుంది. ఈ మూవీతో మంచి సందేశాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. తెలిసో తెలియకో అందరం తప్పులు చేస్తుంటాం. అన్ని ఎమోషన్స్‌ను కంట్రోల్‌లో పెట్టుకునే వాడు గొప్ప మనిషి అని చెప్పదల్చుకుంటున్నాను. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా అందరినీ అలరించేలా మా చిత్రం ఉంటుంది. ‘బార్బరిక్’ కథలో చాలా లేయర్స్ ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలకే మైథలాజికల్ టచ్ ఇచ్చాను. ‘బార్బరిక్’ కంటెంట్ బేస్డ్ మూవీ. ఇందులోని ప్రతీ పాత్రకు భిన్న పార్శ్యాలు ఉంటాయి. సత్య రాజ్ గారు, ఉదయభాను గారు, వశిష్ట గారు ఇలా అందరూ అద్భుతంగా నటించారు.

Next Story