- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శవాల మధ్య కూర్చుంటేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది.. కామాక్షి భాస్కర్ షాకింగ్ కామెంట్స్
శవాల మధ్య కూర్చుంటే నాకు తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ కామాక్షి భాస్కర్ల ఎప్పుడూ తనదైన శైలిలో వార్తల్లో నిలుస్తుంటారు. ‘మా ఊరి పొలిమేర’ వంటి సస్పెన్స్ థ్రిల్లర్లలో నటించి మెప్పించిన ఈ భామ, నిజ జీవితంలో కూడా కాస్త ‘థ్రిల్లింగ్’ గానే ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కామాక్షి ఆమె తన వ్యక్తిగత అలవాట్ల గురించి చెబుతూ చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. సాధారణంగా సెలబ్రిటీలు ఒత్తిడికి లోనైతే విదేశాలకు వెకేషన్స్‌కు వెళ్తారు, లేదా యోగా, మెడిటేషన్ చేస్తారు. కానీ కామాక్షి మాత్రం తనకు శ్మశానమే మెడిటేషన్ సెంటర్ అని చెబుతున్నారు. "నాకు ఎప్పుడైనా మనసు బాగోకపోయినా, లేదా ప్రశాంతత కావాలనిపించినా నేను శ్మశానానికి వెళ్తాను. అక్కడ చితి మంటల మధ్య, శవాల మధ్య కూర్చుంటే నాకు తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
జీవితం అంటే ఏంటో అక్కడే అర్థమవుతుంది" అని ఆమె బాంబు పేల్చారు. సాధారణంగా శ్మశానం అంటేనే భయం, నెగెటివ్ వైబ్స్ అని అందరూ అనుకుంటారు. కానీ కామాక్షి మాత్రం అక్కడ ఉండే నిశ్శబ్దం తనను రీఛార్జ్ చేస్తుందని, ఆ నిశ్శబ్దంలోనే తనకు మనశ్శాంతి లభిస్తుందని తెలిపారు. ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ భామ, ఇలాంటి సెన్సేషనల్ కామెంట్స్‌తో వార్తల్లో నిలవడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ విషయం గురించి తెలుసుకున్న నెటిజన్లు "పొలిమేర సినిమాలో క్షుద్ర పూజలు చేసి.. నిజ జీవితంలో కూడా అలాగే తయారయ్యారా ఏంటి?" అని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.






