- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యంగ్ హీరోలో ఆ కసి ఉంది.. అది తెలిసి నేను చాలా ఆశ్చర్యపోయా: కృతి శెట్టి
ప్రముఖులకే ఇలాంటి పరిస్థితి ఉంటే, ఇక సామాన్య మహిళల భద్రత ఏమిటి? ఏది నిజమో, ఏది నకిలీనో గుర్తించడం రోజురోజుకూ కష్టమవుతోంది

దిశ, సినిమా: టాలీవుడ్ బేబమ్మ కృతి శెట్టి ప్రస్తుతం కోలీవుడ్‌లో తన లక్ పరీక్షించుకుంటోంది. ‘ఉప్పెన’నతో ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ బ్యూటీకి తెలుగులో వరుస ఫ్లాపులు ఎదురవ్వడంతో తమిళ ఇండస్ట్రీపై కన్నేసింది. ప్రస్తుతం వరుసగా తమిళ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ భామ, తాజాగా ప్రదీప్ రంగనాథన్ సరసన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) అనే సైన్స్ ఫిక్షన్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో.. ప్రమోషన్లలో పాల్గొన్న కృతి, తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక చేదు అనుభవాన్ని పంచుకుంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో కృత్రిమ మేధస్సు (AI) సృష్టిస్తున్న అలజడిపై కృతి ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల ఒక వ్యక్తితో తను సన్నిహితంగా ఉన్నట్లుగా ఒక ఫేక్ ఫోటో నెట్టింట వైరల్ అయ్యిందని, అది చూసి తన సొంత తల్లి కూడా దిగ్భ్రాంతికి గురయ్యారని వెల్లడించింది.
"ప్రముఖులకే ఇలాంటి పరిస్థితి ఉంటే, ఇక సామాన్య మహిళల భద్రత ఏమిటి? ఏది నిజమో, ఏది నకిలీనో గుర్తించడం రోజురోజుకూ కష్టమవుతోంది" అని ఆమె ప్రశ్నించింది. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి ఇలా ప్రచారం చేయడంపై కృతి తీవ్రంగా స్పందించింది. ఇక సినిమా విశేషాల గురించి చెబుతూ.. హీరో ప్రదీప్ రంగనాథన్‌లో ఒక తెలియని కసి ఉందని, ప్రతి సీన్ కోసం అతను ఎంతో శ్రమిస్తాడని కొనియాడింది. తన కసి చూసిన తాను చాలా ఆశ్చర్యపోయానని తెలిపింది. అలాగే ఈ సినిమాలో ప్రదీప్ తండ్రిగా నటించిన సీమాన్ గురించి చెబుతూ.. "ఆయన పదజాలం అద్భుతం. సెల్ఫీ లేదా మొబైల్ వంటి ఇంగ్లీష్ పదాలను కూడా వాడకుండా స్వచ్ఛమైన తమిళంలోనే మాట్లాడాలని ఆయన నన్ను పట్టుబట్టేవారు. ఆయనతో మాట్లాడటం వల్ల నా భాష చాలా మెరుగైంది" అని షూటింగ్ ముచ్చట్లను పంచుకుంది.






