- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ హీరోను కించపరచడం కరెక్ట్ కాదు.. యాంకర్‌కు స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన కిరణ్ అబ్బవరం
కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), జైన్ నాని కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కె-ర్యాంప్’(K-Ramp)

దిశ, సినిమా: కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), జైన్ నాని కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కె-ర్యాంప్’(K-Ramp). యుక్తి తరేజా (Yukti Tareja)హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ప్రమోషన్స్‌లో పాల్గొన్న కిరణ్ అబ్బవరం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. మీరు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చారు. స్టార్ అయ్యేందుకు కష్టపడుతున్నారు.. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో సాధ్యమే అంటారా అని ఓ లేడీ యాంకర్ ప్రశ్నించగా.. ఈ విషయంపై కిరణ్ అబ్బవరం స్పందిస్తూ.. ‘‘మీరు ఇలాంటి ప్రశ్నలు నన్ను ఎన్ని అయినా అడగండి పర్లేదు. నేను వాటికి సమాధానం చెబుతాను.
కించపరిచే ప్రశ్నలు అడగడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నన్ను అడిగితే మీరు, నేను ఒకటిగా భావిస్తాను. నన్ను ఓ మాట అన్నా పడతాను. నాకు ఏదైనా చెప్పినా వింటాను. కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఒక హీరోను పట్టుకుని నీ ముఖం బాగా లేదు అని చెప్పకండి. అది విన్న తర్వాత నాకే చాలా బాధగా అనిపించింది’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. యాంకర్‌కు దిమ్మతిరిగేలా చేసావని అంటున్నారు. అలాగే తోటి హీరోకు సపోర్ట్ చేసి గొప్ప మనసు చాటుకున్నావని ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. ఇటీవల ప్రదీప్ రంగనాథన్‌ను ఓ లేడీ యాంకర్ మీరు హీరో మెటీరియలక కాదు మీ ఫేస్ అంత బాగుండదు అని ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇది కాస్త వివాదాస్పదంగా మారింది. దీనిపై కిరణ్ అబ్బవరం ఆగ్రహం వ్యక్తం చేశాడు.






