- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శక్తి అవార్డు అందుకున్నందుకు చాలా గౌరవంగా అనిపిస్తుంది.. మాళవిక మోహనన్ పోస్ట్
కోలీవుడ్ యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది.

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘ది రాజాసాబ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న సినిమాల్లో ‘ది రాజాసాబ్’ (The Rajasaab)ఒకటి. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. యోగిబాబు, సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. రొమాంటిక్ హారర్ మూవీగా రాబోతుండగా.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది.
డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో పాటు ఆమె నటించిన ‘హృదయపూర్వం’ కూడా ఆగస్టు 29న విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, మాళవిక మోహనన్ ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. ‘‘WeWomenWant సమావేశంలో శ్రీ శశి థరూర్ చేతుల మీదుగా 'శక్తి' అవార్డును అందుకున్నందుకు చాలా గౌరవంగా అనిపిస్తుంది. మేము ఒకరినొకరు చూసిన వెంటనే మలయాళం మాట్లాడుకున్నాము. ఆయన నన్ను kumohanan కు తన అభినందనలు తెలియజేయమని అడిగారు. ముంబై అమ్మాయి మలయాళం అనర్గళంగా మాట్లాడటం పట్ల తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. చిన్నగా కానీ చాలా ముద్దుగా మాట్లాడావని అన్నారు’’ అని రాసుకొచ్చింది.






