- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా పనికి గుర్తింపు లేకపోవడం నాకు బాధగా అనిపిస్తోంది: విష్ణు విశాల్
చాలామంది సినీ సెలబ్రిటీలు పనికి తగ్గ ఫలితం కోసం తెగ కష్టపడిపోతుంటారు. కొందరు డబ్బుల పరంగా చూసుకుంటే.. మరికొందరు మాత్రం ఫేమ్ పరంగా చూసుకుంటున్నారు.

దిశ, సినిమా: చాలామంది సినీ సెలబ్రిటీలు పనికి తగ్గ ఫలితం కోసం తెగ కష్టపడిపోతుంటారు. కొందరు డబ్బుల పరంగా చూసుకుంటే.. మరికొందరు మాత్రం ఫేమ్ పరంగా చూసుకుంటున్నారు. ఊహించనంత రెమ్యునరేషన్ ఇవ్వపోయినప్పటికీ తమ కష్టానికి తగిన గుర్తింపును పొందడానికి తెగ ఆరాటపడిపోతున్నారు. ఇక ఇప్పుడు ఈ లిస్ట్‌లో కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ చేరాడు. తన కష్టాన్ని గుర్తించడం లేదని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విష్ణు విశాల్ (Vishnu Vishal)త్వరలో ‘ఆర్యన్’(Aaryan) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ప్రవీణ్ కె(Praveen K) తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అక్టోబర్ 31న విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన విష్ణు విశాల్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా.. తన బాధను వ్యక్తం చేశారు. ‘‘నా పనికి గుర్తింపు లేకపోవడం నాకు కొంచెం బాధగా ఉంది. నేను యువతను ప్రోత్సహించేవాడిని. సినిమా బాగుంటే అభినందిస్తాను. కానీ ఎవరూ నన్ను ప్రోత్సహించలేదు. చిత్రం బాగా ఆడితే, వారు దర్శకుడిని కలవడానికి మాత్రమే పిలుస్తారు. స్క్రిప్ట్‌లు అడుగుతారు. అంతే కానీ నా కష్టాన్ని ఎవరూ గుర్తించరు. నన్ను ప్రోత్సహించేలా మాట్లాడరు.గత కొద్ది కాలంగా ఇండస్ట్రీలో ఉంటున్నప్పటికీ ఎవరూ నా నటను గుర్తించలేదు’’ అని అన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.






