అందురూ నన్ను సూపర్ హీరో అని పిలుస్తుంటే గర్వంగా ఉంది: కళ్యాణి ప్రియదర్శన్

by Mallepaka Hamsa |

మలయాళ యంగ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan)ఇటీవల ‘లోకా చాప్టర్-1 చంద్ర’ (Loka Chapter-1 Chandra)సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

అందురూ నన్ను సూపర్ హీరో అని పిలుస్తుంటే గర్వంగా ఉంది: కళ్యాణి ప్రియదర్శన్
X

దిశ, సినిమా: మలయాళ యంగ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan)ఇటీవల ‘లోకా చాప్టర్-1 చంద్ర’ (Loka Chapter-1 Chandra)సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నిర్మించిన ఈ మూవీ విమర్శలు అనుకున్నప్పటికీ భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణి ప్రియదర్శన్ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘‘అందరు నన్ను ఫిమేల్ సూపర్ హీరో అని పిలుస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా. నాకు చాలా గర్వంగా ఉంది. ‘లోకా చాప్టర్-1’ విజయం సాధించడానికి మా టీమ్ అంతా చాలా కష్టపడ్డాం.

నేను ఈ సినిమాకు సైన్ చేసినప్పుడు ఇంత విజయం సాధిస్తుందని ఊహించలేదు. మంచి కథలో భాగం కావాలని అనుకున్నాను. ఈ సినిమా మొత్తాన్ని నా భుజాలపై వేసుకొని మోసానంటూ అందరూ అభినందిస్తున్నారు. కానీ మా టీమ్ అంతా ఆడ, మగ తేడా లేకుండా కష్టపడ్డారు. ‘లోక చాప్టర్-1’ మొదటి ఫిమేల్ సూపర్ హీరో సినిమా కావడం వల్ల ఎంతోమంది స్ఫూర్తి పొందుతున్నారు. హీరోయిన్స్ కూడా ఎలాంటి పాత్రలోనైనా నటించగలరని నమ్ముతున్నారు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story