అద్భుతమైన బృందంతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను: రుక్మిణి

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-07 15:10:47  IST  )

యంగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) భారీ ప్రాజెక్ట్స్‌లో నటించే అవకాశం అందుకుని ఫుల్ బిజీ బిజీగా ఉంది.

అద్భుతమైన బృందంతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను: రుక్మిణి
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) భారీ ప్రాజెక్ట్స్‌లో నటించే అవకాశం అందుకుని ఫుల్ బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు కాంతార చాప్టర్-1(Kantara Chapter-1), ఎన్టీఆర్-నీల్ కాంబోలో రాబోతున్న మూవీతో పాటు బిల్లా రంగా భాష లో నటిస్తోంది. ఇక ఇటీవల ‘మదరాసి’ (madharaasi)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివ కార్తీకేయన్(Siva Karthikeyan) హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈక్రమంలో.. తాజాగా, రుక్మిణి ట్విట్టర్ ద్వారా ఓ ఆసక్తికర పోస్టర్‌ను షేర్ చేసింది. ‘‘మాలతి పాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉంది. ఆహ్లాదకరమైన ప్రయాణాలలో ఇది ఒకటి. సెట్‌లో మొదటి రోజు నుండి చివరి టేక్ వరకు, ఈ పాత్ర పూర్తిగా కొత్త అనుభవాన్ని అనుభవించడానికి వీలు కల్పించింది. ఇంత అద్భుతమైన బృందంతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు, మీరందరూ అనుభవించడానికి ‘మదరాసి’ థియేటర్లలోకి వచ్చింది. మీకు కచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. మాలతి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది’’ అని రాసుకొచ్చింది.

link

Next Story