- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా సినిమా కోసం ఆమె చేస్తున్న కష్టం చూసి నాకు సిగ్గేస్తోంది: పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu).

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu). మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇందులో నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్గా నటించగా.. అర్జున్ రాంపాల్, బాబీ డియోల్, అనూపమ్ కేర్, అనసూయ, పూజా పొన్నాడ కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ పూర్తి ఈ సినిమా జులై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. నేడు ప్రీ రిలీజ్ ఉండగా.. మూవీ టీమ్ మాత్రం ప్రెస్ మీట్ పెట్టారు.
హైదరాబాద్‌లోని పార్క్ హయాత్‌లో నిర్వహించగా.. ఇందులో ఫార్మల్ బ్లాక్ టీషర్ట్‌లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సింగిల్ హ్యండ్‌తో నిధి అగర్వాల్ భుజాల మీద వేసుకుని ‘హరి హరవీరమల్లు’ ప్రమోషన్స్ చేస్తోంది. నాకే బాధేసింది.. సిగ్గేసింది. తన కెరీర్ తను చూసుకోవాల్సిన అమ్మాయిని కూర్చోబెట్టి ప్రమోషన్స్ చేయిస్తుంటే సిగ్గుగా అనిపించింది. అన్ని చూస్తుంటే.. అదేంటి సినిమాను అనాథలా వదిలేశానా అనుకున్నాను. కానీ ఈ చిత్రాన్ని అనాథలా వదల్లేదు.. నేను ఉన్నాను అని చెప్పడానికి ఇక్కడివి వచ్చాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read:






