పురుష అహంకారాన్ని ఎక్కువగా ఎదుర్కొన్నా.. ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు పడ్డా: ట్వింకిల్ ఖన్నా

by Mallepaka Hamsa |

టాలీవుడ్,బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఎక్కువగా ఉన్నట్లు పలువురు హీరోయిన్లు తమ గొంతు వినిపించారు.

పురుష అహంకారాన్ని ఎక్కువగా ఎదుర్కొన్నా.. ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు పడ్డా: ట్వింకిల్ ఖన్నా
X

దిశ, సినిమా: టాలీవుడ్,బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఎక్కువగా ఉన్నట్లు పలువురు హీరోయిన్లు తమ గొంతు వినిపించారు. అలాగే హీరోలకు ఇచ్చే విలువ కూడా హీరోయిన్లకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారితో సమానంగా పారితోషికం కూడా ఇవ్వడం లేదని హీరోల లాగా కేవలం 8గంటలు మాత్రమే పనిచేసేందుకు దర్శక నిర్మాతలు ఒప్పుకోవడం లేదని చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు. దీనికి తోడు హీరోలు శని, ఆదివారాలలో సెలవులు తీసుకుంటున్నారని.. హీరోయిన్లు మాత్రం ఇలాంటి అవకాశాలు ఇవ్వడం లేదని తమ బాధను మీడియా ద్వారా బయటపెడుతున్నారు. తమకు కూడా హీరోల లాగా గౌరవ మర్యాదలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా పురుష్ అహంకారం ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు పడినట్లు వెల్లడించారు.

తాజాగా, ఈ విషయంపై బాలీవుడ్ హీరోయిన్, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా (Twinkle Khanna)స్పందించింది. ‘టూ మచ్ విల్ ట్వింకిల్ అండ్ కాజోల్’ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆమె.. తాను కూడా ఇండస్ట్రీలో పలు సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. ‘‘ఇండస్ట్రీలో పురుష అహంకారం ఎక్కువగా ఉంది. వారి అహంకారాన్ని తట్టుకుని నిలబడాని ప్రతిసారి మౌనంగా అన్ని భరించాల్సి వస్తోంది. నేను హీరోయిన్‌గా చేసినప్పుడు పురుష అహంకారాన్ని ఎక్కువగా ఎదుర్కొన్నాను. అయినప్పటికీ వారి మనసు నొచ్చుకోకుండా వారిని ఇబ్బంది పెట్టకుండా ..పరిస్థితులకు తగ్గట్లుగా నడుచుకునేదాన్ని. ఏ రోజు ఎవరికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు పడ్డాను’’ అంటూ తనకు ఎదురైన ఇబ్బందులను మాటల్లో వివరించింది. ఇక ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందమంది హీరోయిన్లు పురుష అహంకారం గురించి చెబుతున్నా.. దీనిపై ఎవరు రియాక్ట్ కాకపోవడం గమనార్హం.

Next Story