అవకాశం పేరుతో డ్రైవర్‌గా వాడుకున్నారు : నాని వైరల్ కామెంట్

by Disha Web Desk 7 |
అవకాశం పేరుతో డ్రైవర్‌గా వాడుకున్నారు : నాని వైరల్ కామెంట్
X

దిశ, సినిమా: ప్రజెంట్ టాలీవుడ్‌లో వరుసగా భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో మాస్ మహారాజా రవితేజ, నాని చిత్రాలు ఫుల్ ఫామ్‌తో రిలీజ్ కాబోతున్నాయి. నాని హీరోగా ‘దసరా’ ఈ నెల 30న విడుదలవుతుండగా, రవితేజ నటించిన ‘రావణాసుర’ సినిమా ఏప్రిల్ 7న విడుదలకు రెడీ అయింది. అయితే తాజాగా ఈ ఇద్దరు హీరోలు కలిసి ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇద్దరు హీరోలు వారి కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

అవకాశాల గురించి మొదట నాని మాట్లాడుతూ.. ‘నా ఫోటో ఆల్బమ్ పట్టుకుని చాలా ఆఫీస్‌ల చుట్టూ తిరిగాను. ఎక్కడ కనీసం నాకు ఎంట్రీ కూడా లేదు. ఒక ఫోన్ కూడా రావట్లేదు, కనీసం చిన్న క్యారెక్టర్ కూడా ఆఫర్ చేయలేదు. ఈ ప్రయత్నంలో ఒకరిద్దరు డైరెక్టర్స్ నన్ను డ్రైవర్ లాగా వాడుకున్నారు. రకరకాల పనులు చేయించుకున్నారు. చివరకు నా ATMలో పండుగ బట్టల కోసం దాచుకున్న డబ్బు కూడా వారికి వాడాను. చూసి చూసి చిరాకేసింది. ఇక ఈ యాక్టింగ్ మన వల్ల కాదని ఫిక్స్ అయ్యాను’ అంటూ చెప్పుకొచ్చాడు నాని. కాగా ఈ స్టోరీ విన్న ఫ్యాన్స్.. అలాంటి నాని ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో మూవీ తీస్తున్నందుకు గర్వంగా ఉందంటున్నారు.


Next Story

Most Viewed