నేను ఆ ఒత్తిడిని తీసుకోదలుచుకోలేదు.. చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాను: Kriti Sanon

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-02 07:09:48  IST  )

బాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి సనన్(Kriti Sanon) ఇటీవల విడుదలైన ‘తేరే ఇష్క్ మే’ సినిమాతో మరో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.

నేను ఆ ఒత్తిడిని తీసుకోదలుచుకోలేదు.. చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాను: Kriti Sanon
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి సనన్(Kriti Sanon) ఇటీవల విడుదలైన ‘తేరే ఇష్క్ మే’ సినిమాతో మరో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. టాక్సిక్ లవ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ముఖ్యంగా కృతి నటనకు ప్రశంసలు వచ్చాయి. ఈ విజయంతో ఎంతో ఉత్సాహంగా ఉన్న కృతి కొత్త ఏడాదిలోకి మరింత కాన్ఫిడెన్స్‌తో అడుగుపెట్టింది. ఇక త్వరలోనే ఆమె కెరీర్‌లో మరో కీలక ఘట్టం రాబోతోంది. కృతి సనన్ కెరీర్‌లో 20వ హిందీ చిత్రంగా ‘కాక్‌టేల్–2’ (Cocktail-2)ప్రేక్షకుల ముందుకు రానుంది. 2012లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ‘కాక్‌టేల్’ సినిమాకు ఇది సీక్వెల్ కావడం విశేషం.

ఎలాంటి ఒత్తిడి లేదు..

ఈ చిత్రాన్ని దర్శకుడు హోమి అడజానియా(Homi Adajania) తెరకెక్కిస్తుండగా, ఇందులో షాహిద్ కపూర్, రష్మిక మందన్న, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కాక్‌టేల్–2’ ఆధునిక ప్రేమకథగా, నేటి యువత సంబంధాలు, స్నేహం, వంటి అంశాల ఆధారంగా రాబోతుంది. వినోదంతో పాటు హృదయాన్ని తాకే ఎమోషనల్ కంటెంట్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సమాచారం. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘తేరే ఇష్క్ మే’ హిట్ అయినప్పటికీ నాపై ఎలాంటి ఒత్తిడిని తీసుకురాలేదు. ప్రతి సినిమా స్వభావం వేరు అన్ని చిత్రాలు ఒకే రకంగా ప్రేక్షకులను ఆకర్షిస్తాయని ఆశించడం సరైంది కాదు.

ఎగ్జైటెడ్..

ఒక నటిగా నేను చేయగలిగింది ఒక్కటే. కష్టపడి పనిచేయడం, పూర్తి నిజాయితీతో పాత్రను పోషించడం మాత్రమే. ప్రతి సినిమాకు నావంతు బెస్ట్ ఇవ్వడమే నా లక్ష్యం. ఆ తర్వాత ఫలితం ఎలా ఉంటుందన్నది బాక్సాఫీస్‌ను ప్రభావితం చేసే అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే విజయాల ఒత్తిడిని నేను తీసుకోదలుచుకోలేదు. అలాంటి ఒత్తిడిని నా చిత్రనిర్మాతలపై కూడా పెట్టను. ఫలితాల గురించి ఆలోచిస్తూ భారం మోయడం కన్నా, ప్రయాణాన్ని ఆస్వాదించడమే నాకు ఇష్టం. ‘కాక్‌టెల్-2’ కోసం చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాను’’ అని చెప్పింది.

Next Story