- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను ఇంకా చిన్నపిల్లనే అలాంటి సినిమాలు చేయాలనుకోవడం లేదు.. యంగ్ హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్
నేచురల్ స్టార్ నాని(nani) నిర్మించిన ‘కోర్టు’ (court) సినిమా ద్వారా శ్రీదేవి(Sridevi) హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని(nani) నిర్మించిన ‘కోర్టు’ (court) సినిమా ద్వారా శ్రీదేవి(Sridevi) హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ మూవీ ప్రియదర్శి, సాయి కుమార్, హర్ష్ రోషన్, కాకినాడ శ్రీదేవి కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. టీనేజ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో శ్రీదేవికి యూత్‌లో ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. తన నటన, అందంతో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉంది. ఇటీవల ఓ తమిళ చిత్రానికి శ్రీదేవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. రెగన్ స్టానిస్లాస్(Regan Stanislaus) దర్శకత్వంలో తెరకెక్కుతుండగా..KJR హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీదేవి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నేను హీరోయిన్ అవడం కోసమే ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పుడే కెరీర్ మొదలుపెట్టాను. కానీ నా వయసుకు తగ్గ పాత్రలు రావడం లేదు. ప్రస్తుతం నాకు చాలా అవకాశాలు వస్తున్నాయి. లవ్ స్టోరీ కథల్లో నటించాలని దర్శకనిర్మాతలు అడుగుతున్నారు. ఇద్దరు తెలుగు హీరోల సినిమాల్లోనూ చాన్స్ వచ్చింది.
కానీ నాకు ఇప్పుడే రొమాంటిక్ సీన్స్ ఉన్న చిత్రాలు చేయాలని లేదు. నేను ఇంకా చిన్నపిల్లనే. యాక్టింగ్ మీద పట్టువచ్చాక అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. అప్పటివరకు నా వయసుకు తగ్గ పాత్రలే చేస్తాను. మంచి క్యారెక్టర్స్ చేసి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.






