నా సినిమాలో హీరోయిన్‌గా ఆమె అస్సలే వద్దు.. తేల్చి చెప్పిన అల్లు అర్జున్..!

by Nagaya |
నా సినిమాలో హీరోయిన్‌గా ఆమె అస్సలే వద్దు.. తేల్చి చెప్పిన అల్లు అర్జున్..!
X

దిశ, వెబ్‌డెస్క్ : అల్లు అర్జున్ పుష్ప మూవీతో పాన్ ఇండియా లెవల్‌లో క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం బన్ని పుష్ప -2 తో తగ్గేది లే అంటున్నాడు. అయితే ఈ మూవీ సీక్వెల్ కోసం స్క్రీప్ట్ లాక్ చేయబడిందని, సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేయడానికే తన బృందం కృషి చేస్తుందని చిత్ర దర్శకుడు సుకుమార్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే రీసెంట్‌గా బన్ని గురించి ఒక న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రేజీ బ్యూటీ నయనతార గురించి సుపరిచితయే. ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మ సినిమాలతో బిజీగా ఉండేది. కానీ ప్రజెంట్ ఈ అమ్మడుకి సినిమా అవకాశాలు రావడం లేదు. బన్ని, నయనతార కాంబినేషన్‌లో ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే దానికి గల కారణం వారిద్దరికీ పడకపోవడమే అంటున్నారు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్, నయనతార ఒక ఈవెంట్‌కి అటెండ్ అయ్యారు. ఆ ఈవెంట్‌లో బన్ని నయనతారకు అవార్డు ప్రధానం చేయాలి. కాని దానికి ఆమె నిరాకరించింది. తనకు కాబోయే భర్త విగ్నేష్ శివన్ చేతుల మీదుగా తీసుకోవాలంటూ చెప్పడంతో స్టేజ్ పైకి వెళ్లిన అల్లు అర్జున్ హర్ట్ అయ్యారు. స్టేజ్ నుంచి వెంటనే దిగి వెళ్లిపోయాడు. ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఏదైనా స్టేజ్ మీదకి వెళ్లక ముందే చెప్పాలంటూ అక్కడున్న వారు ఫైర్ అయ్యారు. అప్పటినుంచి బన్నికి, ఆయన అభిమానులకు నయనతార అంటే పడదు.

ఇది ఇలా ఉంటే ప్రజెంట్ పాన్ ఇండియా క్రేజ్ అందుకున్న అల్లు అర్జున్ మూవీలో హీరోయిన్‌గా నయనతారకు కూడా అవకాశం వచ్చిందంటా. కానీ బన్ని ఆమె నా సినిమాలో వద్దే వద్దు అంటూ తేల్చి చెప్పేశాడట. దీంతో అమ్మడుకి మంచి ఆఫర్ మిస్సయిందానే చెప్పవచ్చు. దాంతో ఫ్యాన్స్ బన్ని తగ్గేదేలే.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. పుష్పతో మాములుగా ఉండదు మరీ అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త ట్రెండింగ్ అవుతోంది.

Read More..

తన మూవీ స్టైల్ మార్చిన శేఖర్ కమ్ముల.. అలవాటు లేని పనులు చేయబోతున్నాడా..!Next Story

Most Viewed