నాకొక్క పైసా కూడా వద్దు.. ‘రామాయణ’ సినిమా రెమ్యునరేషన్ మంచి పని కోసం ఉపయోగిస్తా: వివేక్ ఒబేరాయ్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ నటుడు గొప్ప మనసు చాటుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

నాకొక్క పైసా కూడా వద్దు.. ‘రామాయణ’ సినిమా రెమ్యునరేషన్ మంచి పని కోసం ఉపయోగిస్తా: వివేక్ ఒబేరాయ్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు గొప్ప మనసు చాటుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ మూవీ రెమ్యునరేషన్ మొత్తాన్ని ఓ మంచి పని కోసం ఉపయోగిస్తానంటూ ప్రకటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్నాడు. నితేశ్ తీవారీ దర్శకత్వంలో రాబోతుండా.. ఇందులో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor)రాముడిగా, సాయి పల్లవి(Sai Pallavi) సీతగా నటిస్తున్నారు. నమిత్ మల్హోత్రా (Namit Malhotra)నిర్మాణంలో రాబోతున్న ఈ చిత్రంలో స్టార్ హీరో యశ్ రావణుడిగా.. వివేక్ ఒబేరాయ్ విభిషణుడిగా కనిపించబోతున్నారు. కాగా రూ.4000కోట్లు బడ్జెట్‌తో రాబోతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. వచ్చే ఏడాది ఫస్ట్ పార్ట్ రానుండగా.. 2027లో రెండో భాగాన్ని తీసుకురాబోతున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వివేక్ ఒబేరాయ్ తన పారితోషికాన్ని క్యాన్సర్‌తో బాధితులకు ఇవ్వబోతున్నట్లు వెల్లడించాడు.

‘‘నా జీవితంలో ఏది చేసినా పూర్తి ప్రేమతోనే చేస్తాను. నా పారితోషికాన్ని క్యాన్సర్‌తో పోరాడుతున్న పిల్లల సహాయార్థం విరాళంగా ఇవ్వాలనుకుంటున్నా. ఈ విషయాన్ని నేను నిర్మాత నమిక్‌కు కూడా చెప్పాను. ఆయన కూడా మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. నాకు ఒక్క పైసా కూడా వద్దు. నేను బలంగా నమ్మే ఒక మంచి కారణం కోసం ముఖ్యంగా పిల్లల వైద్యం కోసం ఈ మొత్తాన్ని వినియోగించాలనుకుంటున్నాను. హాలీవుడ్ ఇతిహాసాలకు ‘రామాయణం’ భారతదేశం సమాధానంగా ఉండబోతోంది.

VFX లో దాదాపు ఏడు నుండి ఎనిమిది ఆస్కార్‌లను గెలుచుకున్న కంపెనీతో వారు అనుబంధం కలిగి ఉన్నారు. ఇది భారతీయ సినిమాను ప్రపంచ వేదికపైకి తీసుకెళ్తుందని నేను భావిస్తున్నాను. ఈ సినిమా కోసం పనిచేయడం సంతోషంగా అనిపిస్తుంది. నమిత్, నితేష్, యష్, రకుల్ ప్రీత్ సింగ్‌లతో కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉంది. నాకు ఇంకా రెండు రోజుల షూటింగ్ మిగిలి ఉంది’’ అని అన్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా వివేక్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story