ఒకప్పుడు ఉన్నంత ఆనందం ఇప్పుడు లేదు .. ఇడ్లీ తినడానికి కూడా డబ్బులు లేవంటూ ధనుష్ ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) స్వయం దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఇడ్లీ కడై’(Idli Kadai).

ఒకప్పుడు ఉన్నంత ఆనందం ఇప్పుడు లేదు .. ఇడ్లీ తినడానికి కూడా డబ్బులు లేవంటూ ధనుష్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) స్వయం దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఇడ్లీ కడై’(Idli Kadai). నిత్యామీనన్(Nithya Menon) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, సముద్రఖని, పార్తిబన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిలిమ్స్ బ్యానర్స్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 1న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ధనుష్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ‘‘నా చిన్నతనంలో రోజూ ఇడ్లీ తీనాలనిపించేది కానీ నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు.

ఇప్పుడు డబ్బులున్నా కానీ చిన్నతనంలో ఇడ్లీ తినేప్పుడు ఉన్న ఆనందం, రుచి ఇప్పటి రెస్టారెంట్లలో ఉండడం లేదు. ‘ఇడ్లీ కడై’ నిజ జీవితం ఆధారంగా రాబోతుంది. ఇది ఎంతోమంది స్ఫూర్తినిస్తుంది. ఇక ట్రోల్స్ చేసేవారికి నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఇందులో హేటర్స్ అనే కాన్నెప్టే లేదు. అందరూ హీరోలందరి సినిమాలు చూస్తారు కాబట్టి ఎవరో 30 మంది ఒక టీమ్‌గా ఏర్పడి 300మందితో ఫేక్ ఐడీలు క్రియేట్ చేస్తున్నారు.

వారు పాపులారిటీ పొందడం కోసం కొందరు హీరోలపై కావాలని ద్వేషం వ్యక్తం చేస్తూ నెగెటివ్ రివ్యూలిస్తున్నారు. కానీ ఆ 30 మంది కూడా సినిమాలు చూస్తారు. మనకు కనిపించేదానికి రియాలిటీకి చాలా తేడా ఉంది. నేను డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు వంటి చాలా మంది అభిమానులను కలుస్తాను... అది నాకు చాలా సంతోషాన్నిస్తుంది. అభిమానులంతా మీ జీవితంపై దృష్టి పెట్టండి మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అదే నిజంగా ముఖ్యం’’ అని చెప్పుకొచ్చారు.

Next Story