- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆయనతో చెప్పి నిర్ణయం తీసుకుంటా: మమిత బైజు
మలయాళ తార మమితాబైజు(Mamitha Baiju) ‘ప్రేమలు’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి అతి తక్కువ సమయంలోనూ ఫుల్ ఫేమ్ రాబట్టుకుంది.

దిశ, సినిమా: మలయాళ తార మమితాబైజు(Mamitha Baiju) ‘ప్రేమలు’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి అతి తక్కువ సమయంలోనూ ఫుల్ ఫేమ్ రాబట్టుకుంది. ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా మామూలుగా లేదు. క్రేజ్‌తో పాటు వరుస అవకాశాలు కూడా వస్తున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ అంటూ తేడా లేకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన పాపులారిటీని పెంచుకుంటోంది. అయితే ఈ అమ్మడుకి క్రేజ్‌తో పాటు లవ్ ప్రపోజల్స్ కూడా అదే రేంజ్‌లో వస్తున్నాయట.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మమిత బైజు ఈ విషయాలపై స్పందించి క్లారిటీ ఇచ్చింది. ‘‘ప్రేమలు సినిమా హిట్ అయినప్పటి నుంచి లవ్ ప్రపోజల్స్ రావడం బాగా ఎక్కువయ్యాయి. కొందరైతే నా ఫోన్ నంబర్ కనుక్కుని మరీ మెసేజ్‌లు చేస్తున్నారు. నాకు మాత్రం వాటిని చదవడానికి టైమ్ కానీ, ఇంట్రెస్ట్ కానీ లేదు. అందుకే ఆ బాధ్యలన్నీ నేను మా అన్నయ్య మిథున్(Mithun)కు ఇచ్చాను. అతను స్టేట్ లెవెల్ క్రికెట్ ప్లేయర్.. మా మధ్య అన్నాచెల్లెళ్ల రిలేషన్ కంటే ఫ్రెండ్‌షిప్ ఎక్కువ. అందుకే నాకు వచ్చే మెసేజ్‌లు అన్ని మా అన్నయ్య చూసి వాటిని తగినట్లుగా రిప్లై ఇస్తాడు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లకు కూడా తాను కౌంటర్లు వేస్తాడు.
నేను నా జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అన్నయ్యను అడగకుండా డిసైడ్ అవ్వను. ప్రతి విషయంలో మిథున్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. చివరకు నా పెళ్లి ఎవరితో జరగాలి? ఎప్పుడు జరగాలి అనేది కూడా మా అన్నయ్యే ఫిక్స్ చేస్తాడు. అతను ఎవరిని చేసుకోమంటే అతన్ని చేసుకుంటాను’’ అని తన అన్నయ్యపై తనకున్న నమ్మకాన్ని ఈ విధంగా చెప్పుకొచ్చింది. దీంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.






