బెట్టింగ్ యాప్స్ వల్ల ఇంత నష్టం జరుగుతుందని ముందు తెలియదు.. అవన్నీ చూసి చాలా బాధేసింది: మంచు లక్ష్మి

by Mallepaka Hamsa |

ఇటీవల చాలామంది సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

బెట్టింగ్ యాప్స్ వల్ల ఇంత నష్టం జరుగుతుందని ముందు తెలియదు.. అవన్నీ చూసి చాలా బాధేసింది: మంచు లక్ష్మి
X

దిశ, సినిమా: ఇటీవల చాలామంది సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇందులో కలెక్షన్ కింగ్ కూతురు మంచు లక్ష్మి(Manchu Lakshmi) కూడా ఉండటం గమనార్హం. ఇటీవల ఆమెవిచారణకు కూడా హారరైంది. దీంతో ఆమెపై రకరకాల వార్తలు వచ్చాయి. ఈ విషయంపై మంచు లక్ష్మి స్పందించకపోవడంతో పుకార్లు ఎక్కువయ్యాయి. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి బెట్టింగ్ యాప్స్ కేసు విషయంపై స్పందించింది. ‘‘నేను విచారణ ఎదుర్కొన్న విషయం ఒకటి అయితే.. మీడియాలో వచ్చిన వార్తలు వేరు. ఇవన్నీ ఫేక్ నమ్మకండి. మన తెలుగు రాష్ట్రాల్లో వందమంది బెట్టింగ్ యాప్స్‌ను ప్రమో చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. అందులో నా పేరు కూడా ఉండటం వల్ల భాద్యత గల పౌరురాలిగా నేను వెళ్లాను. బెట్టింగ్ యాప్స్ వల్ల ఇంత నష్టం జరుగుతుందని ముందు తెలియదు. తెలిసిన వెంటనే నేను ప్రమోట్ చేయడం ఆపేశాను. అందరికీ క్షమాపణుల కూడా చెప్పాను. అయినా సరే నన్ను చాలామంది నిందించి చాలా మాటలన్నారు. అవన్నీ చూసి నాకు చాలా భాదేసింది. మీడియాలో వచ్చిన వార్తలు నిజం కాదు’’ అని చెప్పుకొచ్చింది. దీంతో పుకార్లకు చెక్ పడినట్లు అయింది.

Next Story