ఆయనతో పని చేయడం అంత సులభం అవుతుందని నేను ఊహించలేదు.. Shruti Haasan

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-03 14:02:54  IST  )

రజినీకాంత్(Rajinikanth), లోకేష్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కూలీ’(coolie).

ఆయనతో పని చేయడం అంత సులభం అవుతుందని నేను ఊహించలేదు.. Shruti Haasan
X

దిశ, సినిమా: రజినీకాంత్(Rajinikanth), లోకేష్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కూలీ’(coolie). ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో శృతి హాసన్, ఉపేంద్ర, నాగార్జున, సౌబిన్ షాహిర్, పూజా హెగ్డే, ఆమిర్ ఖాన్(Aamir Khan) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రబృందం ఫుల్ బిజీగా గడుపుతోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

‘‘మేము ఇనిమెల్ పాటకు పని చేస్తున్నప్పుడు ‘కూలీ’ కథ విన్నాను. నాకు స్టోరీ నచ్చడంతో సరే అన్నాను. లోకేష్ లాంటి దర్శకుడితో పని చేయడం నాకు నిజంగా ఉత్సాహంగా ఉంది. నాకు అందరు నటులతో కాంబినేషన్ సన్నివేశాలు ఉన్నాయి. రజినీ సార్ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. నిజంగా బంగారు హృదయం కలిగి ఉన్నారు. ఆయన సెట్స్‌కి అంత సానుకూల శక్తిని తీసుకువస్తారు. షూట్‌లో చాలా ప్రశాంతంగా, సానుకూలంగా ఉంటారు. ఆయనతో పని చేయడం అంత సులభం అవుతుందని నేను ఊహించలేదు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story