నేను జాన్వీని విమర్శించలేదు.. ‘పరమ్ సుందరి’ వివాదంపై షాకింగ్ ట్విస్ట్ ఇస్తూ పవిత్ర కామెంట్స్

by Mallepaka Hamsa |

యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor), సిద్ధార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra)కాంబోలో వచ్చిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘పరమ్ సుందరి’(Param Sundari).

నేను జాన్వీని విమర్శించలేదు.. ‘పరమ్ సుందరి’ వివాదంపై  షాకింగ్ ట్విస్ట్ ఇస్తూ పవిత్ర కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor), సిద్ధార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra)కాంబోలో వచ్చిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘పరమ్ సుందరి’(Param Sundari). తుషార్ జలోటా(Tushar Jalota) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పలు వివాదాలు మధ్య ఆగస్టు 30న రిలీజ్ అయింది. ప్రస్తుతం థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. అయితే రిలీజ్‌కు ముందు సింగర్ పవీత్రా మేనన్ జాన్వీపై పలు కామెంట్స్ చేస్తూ వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కేరళ బ్యాక్‌డ్రాప్‌ చిత్రంలో నటించేందుకు మలయాళ హీరోయిన్స్ లేరా అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. దీంతో చాలామంది నెటిజన్లు ఆమెపై విమర్శలు చేశారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్రా మేనన్ ‘పరమ్ సుందరి’ వివాదంపై క్లారిటీ ఇచ్చింది.

‘‘నేను నటిని అని తోటి యాక్టర్ జాన్వీని విమర్శించానని గత కొద్ది రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో ఎలాంటి నిజం లేదు. నేను సింగర్‌ను.. ఆమెపై ఉన్న వృత్తిపరమైన అసూయ కాదు. నిజాయితీగా చెప్పాలంటే నేను వేరే వారిన నోటి దగ్గర తిండిని లాగేసుకునే రకం కాదు. నేను భాష గురించి మాట్లాడాను.. కానీ జాన్వి గురించి కాదు. ఆమె ఆ పాత్రకు న్యాయం చేసింది. వ్యక్తిగతంగానూ కలిశాను. నేను మరొక ప్రాందానికి చెందిన వారు మలయాళం సరిగ్గా మాట్లాడలేరని మాట్లాడాను. సినీ ఇండస్ట్రీలో ఏ ప్రాంతం నుంచైనా నటీనటులు ఎంపిక చేసుకోవచ్చు. కాకపోతే ఇతర ప్రాంతాల నుంచి తీసుకున్నప్పుడు వారికి మన భాషను నేర్పించడానికి కోచ్‌ను నియమిస్తే మంచిదని నా అభ్రిప్రాయం. అలా నియమించడం వల్ల నష్టం లేదు’’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ వార్తలకు చెక్ పడినట్లు అయింది.

Next Story