- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఎవరినీ కాపీ చేయడానికి నేను ఇండస్ట్రీకి రాలేదు’.. తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు
స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను(Taapsee Pannu) తనదైన శైలితో సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను(Taapsee Pannu) తనదైన శైలితో సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను మెప్పించిన తాప్సీ వరుస విజయాలతో ఇండస్ట్రీని షేక్ చేసింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే తన ప్రియుడిని పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్‌లో ఫుల్ బిజీ అయిపోయింది. ఈక్రమంలోనే అవకాశాలు కాస్త తగ్గడంతో.. అడపా దడపా చిత్రాల్లో నటిస్తోంది. తాప్సీ చివరిగా 2021లో విడుదలైన ‘హసీన్ దిల్ రుబా’ (Hasin Dil Rubaa)చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాప్సీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
“నా పని భవిష్యత్ తరాలకు ఒక గుర్తింపుగా నిలవాలనే బాధ్యత నాపై ఉంది. అందుకే నేను చేసే ప్రతి పనికి నా జీవితంలోని ప్రతి దశలోనూ బాధ్యత వహించగలగాలి. ఎవరినీ కాపీ చేయడానికి నేను ఈ రంగంలోకి రాలేదు. అలా అయితే నా ప్రయాణమంతా కాపీ చేయడానికే సరిపోతుంది” అని ఆమె స్పష్టం చేసింది. ప్రతి వ్యక్తికీ ప్రత్యేకమైన గళం, వ్యక్తిత్వం ఉంటాయని, అందుకే తనదైన ప్రత్యేకతను కనుగొనడమే శాశ్వతమైన ముద్ర వేసే మార్గమని తాప్సీ అభిప్రాయపడింది. కెరీర్ ప్రారంభంలో దక్షిణాదిలో సంప్రదాయ కమర్షియల్ సినిమాలనే ఎంచుకున్నానని, అయితే ఆ ఆశించిన సక్సెస్ రాలేదని.. ఆ మార్గం తనకు సరిపోదని గ్రహించానని చెప్పింది. వరుస పరాజయాలు, బాధాకర అనుభవాలు ఎదురైనా వాటి నుంచే పాఠాలు నేర్చుకుని తన ఆలోచనను మార్చుకున్నానని తాప్సీ వెల్లడించింది.






