రీఎంట్రీతో షాకిచ్చిన టాలీవుడ్ నటి.. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-16 09:34:00  IST  )

టాలీవుడ్ యంగ్ బ్యూటీ మధు శాలిని(Madhu Shalini) ‘కితకితలు’ సినిమాలో కీలక పాత్రలో నటించింది.

రీఎంట్రీతో షాకిచ్చిన టాలీవుడ్ నటి.. ఇప్పుడు  చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్  (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ మధు శాలిని(Madhu Shalini) ‘కితకితలు’ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఆ తర్వాత జగడం, ఒక వి చిత్రం, అనుగుణం, గోపాల గోపాల వంటి మూవీస్‌తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. తెలుగు, తమిళ బాషలో పలు సినిమాల్లో నటించిన మధు శాలిని గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఇప్పుడు మళ్లీ నిర్మాతగా ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇస్తోంది. దామోదర దర్శకత్వంలో తెరకెక్కిన ‘కన్యా కుమారి’ చిత్రాన్ని రాడికల్ పిక్చర్స్, సృజన్ సినిమాస్ బ్యానర్స్‌పై మధు శాలిని నిర్మిస్తోంది. ఇందులో గీత్ సైనీ, శ్రీచరణ్ రాచకొండ (Sricharan Rachakonda)ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, చిత్రబృందం ప్రెస్ మీట్ పెట్టగా.. ఇందులో పాల్గొన్న మధు శాలిని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘సినిమాలకు చాలా గ్యాప్ వచ్చిందని అందరూ అడుగుతున్నారు. తెలియక కెరీర్ తొలినాళ్లలో ఏది పడితే అది చేసి చేతులు కాల్చుకున్నాను. ఆ తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే.. ఏది పడితే అది కాకుండా నచ్చిన సినిమాను చేయాలి. న్యాయం చేయాలనుకున్న స్క్రిప్ట్‌లు మాత్రమే ఒప్పుకోవాలి. దాని వల్ల నేను సెలెక్టీవ్‌గా చిత్రాలు చేస్తున్నాను. ప్రాజెక్టుల విషయంలో ఇప్పుడు నేను చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నాను.

తెలుగులో ‘గూఢచారి’ నా లాస్ట్ మూవీ. ఆ తర్వాత వెబ్‌సిరీస్‌లు, తమిళ చిత్రాలు చేశాను. ఇతర భాషలో నటించాను కానీ తెలుగులో ‘కన్యాకుమారి’తో రాబోతున్నాను. అంతేకాకుండా నేను డైరెక్ట్ చేసిన సినిమా నా ప్రొడక్షన్‌లో త్వరలోనే రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే నేను మరో మూవీతో మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి మీ ముందుకు రాబోతున్నాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

link

Next Story