- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారానికి ఒక్కసారి కచ్చితంగా ఏడుస్తాను.. సయారా బ్యూటీ షాకింగ్ కామెంట్స్
ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో భారీ క్రేజ్‌కు రాబట్టుకున్న వారిలో అనీత్ పడ్డా(Aneet Padda) ఒకరు.

దిశ, సినిమా: ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో భారీ క్రేజ్‌కు రాబట్టుకున్న వారిలో అనీత్ పడ్డా(Aneet Padda) ఒకరు. ‘సైయారా’ (Saiyaara)సినిమాతో హీరోయిన్‌గా వచ్చిన ఈ భామ ఊహించని పాపులారిటీ దక్కించుకుంది. ఒక్క చిత్రంతో స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిపోయింది. ప్రస్తుతం ‘శక్తి శాలిని’ (Shakti Shalini)చిత్రంతో రాబోతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం కియారాను సెలెక్ట్ చేసుకోగా.. ఆమె తప్పుకోవడంతో అనీత్‌ని ఫైనల్ చేశారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనీత్ పడ్డా పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.
‘‘నేను చాలా సెన్సిటివ్.. ఏ విషయాన్నైనా డీప్‌గా ఆలోచిస్తుంటాను. ముఖ్యంగా ప్రేమగా ఉండే విషయంలో బాధ్యతగా ఉండాలని, మనల్ని సమర్థించే వ్యక్తులు సరిగ్గా వ్యవహరించాలనే ఆలోచనలు నాకు ఒత్తిడిని కలిగిస్తాయి. కొంతమంది నా ఫొటోలను ఎడిట్ చేయడం చూసి వారానికి ఒకసారి కచ్చితంగా ఏడుస్తుంటాను. కానీ నా అభిమానులు చాలా విషయాల్లో నన్ను సరిదిద్దుతుంటారు. నా హార్డ్ వర్క్‌తో నాకొచ్చే పాత్రలకు నేను న్యాయం చేయగలనని ఆశిస్తున్నాను. నిజానికి నేను చిన్నప్పుడు చాలా అమాయకురాలిని. చాలా విషయాల గురించి కలలు కనే దానిని. ఏదైనా పర్ఫామెన్స్ ఇచ్చేముందు నాకు నేను ధైర్యం తెచ్చుకుంటాను. పాత్రకు సంబంధించి అనుభూతి చెందుతాను.
నేను చెప్పేది ఒకటే.. అతిగా ఆలోచించవద్దు. మీరెలా ఫీలవుతారో అలాగే చెప్పండి. నేను నటించాలనుకున్నాను. కాబట్టి దానిపై ఆసక్తితో ప్రయత్నించి సక్సెస్ అందుకున్నాను. కొన్నిసార్లు నేను తలుపులు మూసుకొని ఆడిషన్లను రికార్డ్ చేసేదానిని, మా పేరెంట్స్ అడిగితే హోం వర్క్ చేస్తున్నా అని అబద్ధం చెబుతుంటాను. ఇక సయ్యారాతో నా జీవితమే మారిపోయింది’’ అని చెప్పుకొచ్చింది. ఇక ఏడుస్తుందని తెలుసుకున్న వారంతా ఆశ్చర్యపోతున్నారు. కాగా.. ‘శక్తి శాలిని’ సినిమా అమర్ కౌశిక్ దర్శకత్వంలో రాబోతుంది. హారర్ బ్యాక్‌డ్రాప్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మ్యాడాక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో అనీత్ పడ్డా ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.






