నా జీవితాన్ని నేనే నిర్ణయించుకుంటున్నా.. ఆ స్టార్ హీరోతో నటించాలన్నది నా కల: అక్షర రెడ్డి

by Mallepaka Hamsa |

యంగ్ హీరోయిన్ అక్షర రెడ్డి(Akshara Reddy) ‘రైట్’ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ చిత్రం థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది.

నా జీవితాన్ని నేనే నిర్ణయించుకుంటున్నా.. ఆ స్టార్ హీరోతో నటించాలన్నది నా కల: అక్షర రెడ్డి
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ అక్షర రెడ్డి(Akshara Reddy) ‘రైట్’ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ చిత్రం థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్షర రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘కమల్ హాసన్ (Kamal Haasan)సర్‌తో నటించాలన్నది నా కల. రియాలిటీ షో వల్ల ఆయనతో మాట్లాడే అవకాశం వచ్చింది. అప్పుడు ఆయన అందరికీ ఓ ముఖ్యమైన విషయం చెప్పారు. నీ జీవితంలో రేపు ఏమి జరగాలన్నది నువ్వే నిర్ణయించుకోవాలని అన్నారు. కమల్ సర్ చెప్పిన మాట నా మనసులో నాటుకుపోయింది. నా జీవితాన్ని నేను నిర్ణయించుకుంటున్నాను. సూపర్ స్టార్ రజినీకాంత్, ఐశ్వర్య రామ్, శ్రీదేవి, శృతి హాసన్ అంటే ఇష్టం. ఇటీవల మా అమ్మ చనిపోయింది. ఆ తర్వాత సినిమా రంగమే వద్దనే భావనకు వచ్చాను. కానీ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో నటించేందుకు అంగీకరించాను’’ అని చెప్పుకొచ్చింది.

Next Story