52 ఏళ్ల వయసులో ఆ పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా.. ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మలైకా

by Mallepaka Hamsa |

హాట్ బ్యూటీ మలైకా అరోరా(Malaika Arora) వయసుతో సంబంధం లేకుండా గ్లామర్‌కు కొత్త నిర్వచనం చెబుతోంది.

52 ఏళ్ల వయసులో ఆ పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా.. ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మలైకా
X

దిశ, సినిమా: హాట్ బ్యూటీ మలైకా అరోరా(Malaika Arora) వయసుతో సంబంధం లేకుండా గ్లామర్‌కు కొత్త నిర్వచనం చెబుతోంది. 52 ఏళ్ల వయసులోనూ ఐటెం సాంగ్స్‌తో స్టేజ్‌ను షేక్ చేస్తూ.. ‘ఏజ్ జస్ట్ ఎ నంబర్’ అన్న మాటను నిజం చేస్తోంది. తన డ్యాన్స్‌, ఫిట్‌నెస్‌తో యంగ్ హీరోయిన్లకే పోటీ ఇస్తోంది. సినిమాలు తక్కువే చేసినా.. తన స్పెషల్ సాంగ్స్‌తో మాత్రం బాలీవుడ్‌కు ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. డ్యాన్స్ అనగానే గుర్తొచ్చే పేర్లలో మలైకా ఒకటి. అయితే ఇటీవల ఆమెపై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువయ్యాయి. డ్యాన్స్ చేయడం మానేయాలి”, క్షమాపణలు చెప్పాలి అంటూ కామెంట్స్ చేయడంతో మలైకా స్పందించింది. ‘డ్యాన్స్ నా శక్తి. అది నా ఆత్మకు ఆనందం ఇస్తుంది. నేను చేసిన పనికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు’ అంటూ ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మలైకా అరోరా షాకింగ్ కామెంట్లతో ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ‘‘గత కొద్ది కాలంగా నాపై కొందరు కావాలనే నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ నేను డ్యాన్స్ చేయడం ఎందుకు తగ్గించాలని అంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆ విషయం నేను క్షమాపణలు ఎందుకు చెప్పాలి. ట్రోల్స్ ఎప్పుడూ వచ్చేవే.. కానీ డ్యాన్స్ చేయడమే గొప్ప విషయం అని నేను అనుకుంటా. అదో కళ.. అది నాలో ఉన్నందుకు దానిని నేను గౌరవంతో ఆస్వాదిస్తున్నా. 52 ఏళ్ల వయసులో నేను ఐటెం సాంగ్స్‌లో హుషారుగా డ్యాన్స్ చేయగలుగుతున్నా అంటే అది నా అదృష్టంగా భావిస్తున్నా. నేను సరైన మార్గంలోనే ప్రయాణిస్తున్నా. ఇలాంటి పాటలతో అలరించడం నాకు చాలా శక్తి వస్తుంది. నన్ను చూసి మరికొందరు మహిళలు నాలా హుషారుగా ఉంటే దానికి మించిన ఆనందం నాకు మరొకటి లేదు’’ అని చెప్పుకొచ్చింది.

Next Story