- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదొక గొప్ప అవకాశం.. ‘జై హనుమాన్’ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చిన రిషబ్ శెట్టి
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishabh Shetty)ఇటీవల ‘కాంతార: చాప్టర్1’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishabh Shetty)ఇటీవల ‘కాంతార: చాప్టర్1’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం పలు రికార్డులు క్రియేట్ చేసి బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. ప్రస్తుతం రిషబ్ శెట్టి తెలుగులో ‘జై హనుమాన్’(Jai Hanuman) మూవీ చేస్తున్నారు. ఇందులో హనుమాన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రశాంత్ వర్మ(Prashanth Verma) దర్శకత్వంలో రాబోతుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హఇట్ ‘హనుమాన్’కు సీక్వెల్‌గా రానుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’ అప్డేట్ రివీల్ చేశారు. ‘‘నటుడిగా నటించడం నాకు ఇష్టం. కానీ దర్శకత్వం ఇచ్చే సంతృప్తి వేరు. కథా రచన నుంచి నిర్మాణం వరకు ప్రతి దశను నేను ఆస్వాదిస్తాను.
నా కథలన్నీ నా ఊరి జీవితాల నుంచే పుట్టాయి. నా తదుపరి చిత్రం జై హనుమాన్ జనవరి నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. నేను దర్శకత్వం వహించే సినిమా రావడానికి ఇంకో రెండేళ్లు పట్టొచ్చు. ఏ చిత్రం చేస్తాననేది ఇప్పుడే చెప్పలేను. నటుడిగా నేను ఒప్పుకున్న సినిమాలన్ని పూర్తి చేయాలి. జై హనుమాన్ ప్రయాణంలో నేను పూర్తి స్థాయిలో తెలుగు నేర్చుకుంటా. నాకు అదొక గొప్ప అవకాశం. అది నాకు కొత్త సవాలు. అలాగే గత కొద్ది రోజులుగా నేను ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమాలో నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. దయచేసి తప్పుడు వార్తలను నమ్మకండి’’ అని చెప్పుకొచ్చారు.






