- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆమె నా అదృష్టంగా భావిస్తాను.. అందుకే ఆ పేరుతో ఉన్న గొలుసు వేసుకున్నా: రాణీ ముఖర్జీ
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణీ ముఖర్జీ(Rani Mukherjee) ఇటీవల నేషనల్ అవార్డు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్శించింది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణీ ముఖర్జీ(Rani Mukherjee) ఇటీవల నేషనల్ అవార్డు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్శించింది. అలాగే అవార్డ్ ఫంక్షన్‌లో ఆమె ఓ స్పెషల్ చైన్ ధరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన కూతురు అదీరా పేరుతో ఉన్న గొలుసు ధరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈక్రమంలో.. రాణీ ముఖర్జీ ఆ గొలుసు వేసుకోవడంపై స్పందించింది. ‘‘నేను నేషనల్ అవార్డు తీసుకునేటప్పుడు నా పక్కనే ఉండాలని నా కూతురు ఎంతగానో ఆశపడింది. కానీ ఈ వేడుకకు తాను రాలేకపోయింది.
14 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు అనుమతి లేదు కాబట్టి రాలేదు. నాకెంతో ప్రత్యేకమైన రోజున తను నా పక్కన ఉండలేకపోయింది. అదిరా(Adira)ను నా అదృష్టంగా భావిస్తాను. అందుకే నేను నా కూతురు పక్కనే ఉండాలని భావించి ఆమె పేరుతో ఉన్న గొలుసు ధరించాను. ఇక ఇన్‌స్టాలో ఈ విషయంపై చాలామంది రీల్స్ చేశారు. వాటిని మా అమ్మాయికి చూపించా. చాలా చాలా ఆనందపడింది. ఆ రీల్స్ చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పక్కన ఉండలేకపోయానని బాధపడిన నా కూతురు మీ వల్లే సంతోషపడింది’’ అని చెప్పుకొచ్చింది.






