- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎవరూ ఊహించని ప్రమాదకరమైన ప్రయోగం చేశా.. అలా జరుగుతుందని అనుకోలేదు : రుక్మిణి వసంత్
కన్నడ యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.

దిశ, సినిమా: కన్నడ యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ మూవీ అమ్మడుకి ఊహించని పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఇందులోని నటనకు ప్రశంసలు కూడా దక్కాయి. ఇక ఈ సినిమాతో రుక్మిణి వసంత్ రేంజ్ మారిపోయింది. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ తన ఫేమ్ పెంచుకుంటుంది. ఇటీవల ‘మదరాసి’తో ప్రేక్షకులను అలరించిన ఈ భామ ‘కాంతార: చాప్టర్1’(Kantara: Chapter 1)మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో పాటు రుక్మిణి వసంత్ కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ క్రేజీ హీరోయిన్‌గా రాణిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రుక్మిణి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తాను రిషబ్ శెట్టి ‘కాంతార:చాప్టర్1’ విలన్‌గా నటించడంపై తన అనుభవాన్ని పంచుకుంది. కాంతారలో నేను విలన్ పాత్రలో నటించడం నా కెరీర్ ప్రారంభంలో చేసిన ఒక ప్రమాదకరమైన ప్రయోగం అని చెప్పాలి. ఎందుకంటే నేను నటించిన విలన్ పాత్రను ప్రజలు ఇష్టపడ్డారు కాబట్టి సరిపోయింది. లేకుంటే నన్ను ద్వేషించే వారు. ట్రోల్స్ చేసేవారు.. నా కెరీర్‌పై ప్రభావం చూపించేది. కానీ ప్రేక్షకులు అలా చేయలేదు. అలాగే నేను అందులో విలన్ పాత్రలో కనిపిస్తాని ఎవరూ ఉహించలేదు. అలాగే ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారని అనుకోలేదని చెప్పింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More..
నేను ఏఐ బాధితురాలినే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ టాలీవుడ్ హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్






