- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేము సృష్టించిన ఈ ప్రపంచంలోకి మీరందరూ అడుగు పెట్టే వరకు నేను వేచి ఉండలేను: రాశి ఖన్నా
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా(Raashi Khanna),శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘తెలుసు కదా’(telusu kada).

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా(Raashi Khanna),శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘తెలుసు కదా’(telusu kada). సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda)హీరోగా నటిస్తుండగా.. వైవా హర్ష కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నీరజ కోన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని పీపుల్ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘తెలుసు కదా’ సినిమా అక్టోబర్ 17న థియేటర్స్‌లోకి రాబోతుంది. తాజాగా, రాశి ఖన్నా ‘తెలుసు కదా’ లోని తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ ‘‘కొన్ని కథలు కెమెరాలు తిరగడం ఆగిపోయినా.. మధురమైన జ్ఞాపకాలు మనల్ని వదిలిపోవు. వాటిలో ఒకటి ‘తెలుసు కదా’. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ నేను ఈ రోజు పూర్తి చేశాను. ఈ ప్రయాణాన్ని నాతో పాటు ముందుకు తీసుకెళ్లిన అత్యంత అద్భుతమైన చిత్ర బృందానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మేము సృష్టించిన ఈ ప్రపంచంలోకి మీరందరూ అడుగు పెట్టే వరకు నేను వేచి ఉండలేను. మీరు ఒక వైల్డ్ రైడ్ కోసం సిద్ధంగా ఉండండి’’ అని రాసుకొచ్చింది.






