- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ డైరెక్టర్ మాటలు నన్ను చాలా బాధించాయి: నాని
టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘దసరా’.

X
దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 30న విడుదలకానుంది. దీంతో మూవీ టీమ్ జోరుగా ప్రమోషన్లు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న నాని తాజాగా కెరీర్‌లో తానెదుర్కొన్న సవాళ్ల గురించి పలు విషయాలు పంచుకున్నాడు.
‘కెరీర్ మొదట్లో.. నా చుట్టూ ఏం జరుగుతుందో అర్థం అయ్యేది కాదు. చాలా కష్టంగా అనిపించేది. సహాయం చేయడానికి ఎవరూ లేరు. చాలా సవాళ్లు, తిరస్కరణలు ఎదుర్కొన్నా. ఓ మూవీ షూటింగ్‌లో అందరిముందే ‘నువ్వు ఎప్పటికి డైరెక్టర్ కాలేవు’ అని ఓ దర్శకుడు సెట్‌లోనే గట్టిగా అరిచి అవమానించాడు. ఆ మాట నన్ను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ఎన్నో విమర్శలు తట్టుకుని నిలబడినందుకు ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read...
Next Story






