- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతన్ని నేను మర్చిపోలేకపోతున్నా.. ఇప్పటికీ బాధపడుతున్నానంటూ అనుపమ ఎమోషనల్ కామెంట్స్
యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస చిత్రాలు చేస్తోంది.

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస చిత్రాలు చేస్తోంది. అమ్మడు పలు హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది. ఇక ఇటీవల అనుపమ ‘కిష్కింధపురి’ (Kishkindhapuri)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ హారర్ థ్రిల్లర్‌గా వచ్చి బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్‌గా నిలవడంతో పాటు థియేటర్స్‌లో దూసుకుపోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘‘నా ఫ్రెండ్‌తో నేను గత కొద్ది కాలంగా మాట్లాడలేదు. చిన్న మనస్పర్థలు రావడంతో దూరం అయ్యాను.
అతని మెసేజ్‌లకు కూడా రిప్లై ఇవ్వలేదు. చాలా రోజుల తర్వాత ఇటీవల నన్ను చూశాడట నాకు మెసేజ్ చేశాడు. నేను చూసినా రిప్లై ఇవ్వలేదు. కానీ రెండు రోజుల తర్వాత అతను అనూహ్యంగా చనిపోయాడు అని తెలిసింది. ఈ విషయం తెలుసుకుని షాక్ అయ్యాను. దీంతో ఒకే ఒక్క విషయం అర్థం చేసుకున్నాను. మనలను ప్రేమించే వారితో వచ్చిన చిన్న విరోధాల కూడా జీవితంలో తీవ్ర బాధలను సృష్టించగలవని తెలిసొచ్చింది. నా జీవితంలో ఈ సంఘటనను మర్చిపోలేను కావచ్చు. ఇప్పటికీ అతని జ్ఞాపకాలను తలుచుకొని బాధపడుతుంటాను. మనం స్నేహాలను గౌరవంతో నడిపితే మనసులోని బాధలు తగ్గుతాయి’’ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ అమ్మడు సినిమాల విషయానికొస్తే.. త్వరలోనే ‘బైసన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ సరసన నటిస్తోంది.






