అనిరుధ్ చేసిన సాయం ఎప్పటికీ మరువలేను.. ఆ సమయంలో నా కళ్లు చెమర్చాయి: విఘ్నేష్ శివన్

by Mallepaka Hamsa |

అప్పట్లో నా ఆర్థిక పరిస్థితి అంత దారుణంగా ఉండేది. అలాంటి కష్ట సమయంలో అనిరుధ్ నా చేయి పట్టుకున్నాడు.

అనిరుధ్ చేసిన  సాయం ఎప్పటికీ మరువలేను.. ఆ సమయంలో నా కళ్లు చెమర్చాయి: విఘ్నేష్ శివన్
X

దిశ, సినిమా: కోలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా, లేడీ సూపర్ స్టార్ నయనతార భర్తగా విఘ్నేష్ శివన్ అందరికీ సుపరిచితమే. కానీ, ఈ స్థాయికి చేరడానికి ఆయన వెనుక ఎవరికీ తెలియని ఒక కన్నీటి కథ ఉందట. తన కష్టాల్లో నీడలా తోడుండి, ఈరోజు తను ఈ పొజిషన్‌లో ఉండటానికి కారణమైన మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ గురించి విఘ్నేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన కెరీర్ టర్నింగ్ పాయింట్ అయిన ‘నానుమ్ రౌడీ దాన్’ (నేను రౌడీనే) సినిమా ప్రారంభ సమయం గురించి విఘ్నేష్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. "ఆ సినిమా షూటింగ్ కోసం నేను పాండిచ్చేరి వెళ్లాలి. నా దగ్గర బస్సు టికెట్ కోసం కేవలం ₹250 మాత్రమే ఉన్నాయి. అంతకు మించి చిల్లిగవ్వ కూడా లేదు. అప్పట్లో నా ఆర్థిక పరిస్థితి అంత దారుణంగా ఉండేది. అలాంటి కష్ట సమయంలో అనిరుధ్ నా చేయి పట్టుకున్నాడు. కేవలం సంగీతం ఇవ్వడమే కాదు, నన్ను నమ్మి ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి అన్ని రకాలుగా వెన్నుముకగా నిలిచాడు.

నా బ్యాగులో సీక్రెట్‌గా రూ. 50,000 ఉంచి బస్సులో ఉండగానే మెసేజ్ చేశాడు. అప్పుడు ఆ మెసేజ్ చూసి నా కళ్లు చెమర్చాయి.నా జీవితంలో అనిరుధ్ లేకపోతే ఈరోజు విఘ్నేష్ శివన్ అనే డైరెక్టర్ ఉండేవాడు కాదు" అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నయనతారను కలవడానికి, పెళ్లి చేసుకోవడానికి పునాది పడిన ఆ సినిమా వెనుక అనిరుధ్ ప్రోత్సాహం ఎంతో ఉందని విఘ్నేష్ గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఉన్నది కేవలం ప్రొఫెషనల్ బాండింగ్ మాత్రమే కాదు, అంతకు మించిన ఒక బలమైన స్నేహం. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో రాబోతున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIC) సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ కోసం అనిరుధ్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చారని, కష్టాల్లో తోడున్న స్నేహితుడికి ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తానని విఘ్నేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Next Story