నన్ను ద్వేషించకండి అని ఐశ్వర్య రాయ్‌ని అడిగాను.. స్నేహ ఉల్లాల్ షాకింగ్ కామెంట్స్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-17 08:07:27  IST  )

నేను ఒకసారి ఐశ్వర్య రాయ్‌ని కలిశాను. అప్పుడు ఆమె నన్ను బాలీవుడ్ ఫ్యామిలీలోకి ఆహ్వానించారు.

నన్ను ద్వేషించకండి అని ఐశ్వర్య రాయ్‌ని అడిగాను.. స్నేహ ఉల్లాల్ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: నటి స్నేహ ఉల్లాల్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన ‘లక్కీ: నో టైమ్ ఫర్ లవ్’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత టాలీవుడ్‌లో కూడా తన ముద్ర వేశారు. ఉల్లాసంగా ఉత్సాహంగా, నేను మీకు తెలుసా?, మడత కాజా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయినప్పటికీ అవకాశాలు రాక కొద్ది కాలంగా సినిమాలకు దూరం అయిన స్నేహ.. ఇటీవల 'నీలకంఠ' అనే చిత్రంలో మాస్టర్ మహేంద్రన్ సరసన కనిపించారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న స్నేహ ఉల్లాల్, తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అప్పట్లో ఆమె అచ్చు ఐశ్వర్య రాయ్‌లాగే ఉంటుందని, ఆమెకు డూప్లికేట్ అని మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోలికల గురించి స్నేహ స్పందిస్తూ, అవి తనను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేశారు.

ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్ అయినప్పుడు తన సర్కిల్‌లో కూడా అందరూ తనను ఐశ్వర్యలా ఉన్నావని అనేవారని స్నేహ గుర్తు చేసుకున్నారు."నేను ఒకసారి ఐశ్వర్య రాయ్‌ని కలిశాను. అప్పుడు ఆమె నన్ను బాలీవుడ్ ఫ్యామిలీలోకి ఆహ్వానించారు. అయితే మీడియాలో మా ఇద్దరి మధ్య జరుగుతున్న పోలికల వల్ల ఆమె ఎక్కడ ఫీల్ అవుతుందో అని భయపడి.. 'నన్ను క్షమించండి, ప్లీజ్ నన్ను ద్వేషించకండి' అని ఆమెతో చెప్పాను" అంటూ ఆనాటి మధుర జ్ఞాపకాన్ని పంచుకున్నారు. తాను చాలా చిన్న వయసులో ఇండస్ట్రీలోకి రావడం వల్ల తనకు ఎలాంటి ఈగో ఉండేది కాదని, అందుకే ఈ పోలికలను పట్టించుకోలేదని ఆమె తెలిపారు. ఈ విషయం తెలిసి కొందరు షాక్ అవుతున్నారు. మరికొందరు ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అని అంటున్నారు. స్నేహ తన కోస్టార్ సల్మాన్ ఖాన్ గురించి చెబుతూ.. ఆయన సెట్స్‌లో ఎప్పుడూ 'సూపర్ స్టార్' అని గర్వం చూపించలేదని, షూటింగ్ సమయంలో తనకు ఎంతో మద్దతుగా నిలిచారని స్నేహ కొనియాడారు. ఐశ్వర్య రాయ్ పోలికలు ఉండటం వల్లే తనను ఈ సినిమాలో తీసుకున్నారనే వార్తలు కేవలం పీఆర్ (PR) స్టంట్ మాత్రమేనని ఆమె కొట్టిపారేశారు.

‘‘ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం’’.. ట్రోలర్స్‌కు శ్రీలీల స్ట్రాంగ్ కౌంటర్!

Next Story