- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇలాంటి పాత్ర చేయడానికి హనుమాన్‌కు సారీ చెప్పి రంగంలోకి దిగాను.. మంచు మనోజ్ వైరల్ కామెంట్స్
మంచు మనోజ్(manchu manoj) ఇటీవల ‘భైరవం’తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

దిశ, సినిమా: మంచు మనోజ్(manchu manoj) ఇటీవల ‘భైరవం’తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’(Mirai)తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. తేజ సజ్జా(Teja Sajja), కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రియా శరన్, జగపతి బాబు, మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో సెప్టెంబర్ 12న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ మేకర్స్ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
‘‘మిరాయ్‌లో రెండు గొప్ప శక్తులు తల పడితే ఏం జరుగుతుందో చూపించబోతున్నాము. ఇది ఒక మోడ్రన్ రావణుడు వెర్షన్‌లా ఉంటుంది. కానీ నేను ఆడవాళ్ల జోలికి వెళ్లకుండా నాకంటూ ఒక తత్వం ఉన్న పాత్రలో నటించాను. సీత రావణుడి జీవితంలోకి రాకముందు అతను ఎలా ఉండేవాడో, అలాంటి స్టైల్ ఈ పాత్రలో ఉంటుంది. అతనికి ఓటమి అంటే నచ్చదు. శక్తి ఉన్నవాడికే స్థానం దక్కాలి అన్నది అతని నమ్మకం. కష్టపడని వాడికి ఈ ప్రపంచంలో చోటు ఉండకూడదు అనే స్ట్రాంగ్ పాయింట్‌తో ‘మిరాయ్’ మీ ముందుకు వస్తుంది. అసలు నేను ఇలాంటి చెడ్డ వ్యక్త పాత్రలో నటించేందుకు ముందు దేవుడికి దండం పెట్టుకుని అలాగే హనుమంతుడికి క్షమాపణలు చెప్ప రంగంలోకి దిగాను’’ అని చెప్పుకొచ్చాడు.






