- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి.. రణ్‌వీర్ కీలక నోట్ విడుదల
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)ఇటీవల ‘కాంతార: చాప్టర్1’(Kantara: Chapter 1) సినిమాపై వివాదాస్పద కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)ఇటీవల ‘కాంతార: చాప్టర్1’(Kantara: Chapter 1) సినిమాపై వివాదాస్పద కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో ఏకంగా రిషబ్ శెట్టి (Rishabh Shetty)మంజూరీ దేవతపై తెరకెక్కించిన సీన్లలో ఒకటైన ఓ అనే శబ్దాన్ని స్టేజ్‌పై కామెడీగా చేసి చూపించి ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా రణ్‌వీర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని అంత అద్భుతమైన సీన్‌ను జోక్‌గా చూపించడంపై మండిపడుతున్నారు. ఇలాంటి సినీ సెలబ్రిటీలకు బాగా అలవాటు అయిందని స్టేజ్‌పై ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి రణ్‌వీర్ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీంతో రణ్‌వీర్, సారా అర్జున్ కాంబోలో డిసెంబర్ 5న రాబోతున్న ‘ధురంధర్’ చిత్రాన్ని కూడా విడుదల అడ్డుకుంటామని హెచ్చరించారు. క్షమాపణలు చెప్పకుంటే ఏం చేయడానికైనా సిద్ధమే అన్నట్లుగా నెటిజన్ల తీరు ఉంది. ఇక ఈ వ్యాఖ్యలపై హిందూ జనజాగృతి సమితి ఆయనపై కంప్లైంట్ కూడా చేసింది. ఈక్రమంలో.. తాజాగా, రణ్‌వీర్ క్షమాపణలు చెప్తూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కీలక నోట్ విడుదల చేశాడు. ‘‘నేను ఇటీవల ‘కాంతార:చాప్టర్1’ సినిమాపై చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.
కానీ రిషబ్ చాలా బాగా చేశారని చెప్పడం కోసం నేను అలా నటించాను. ఆ సన్నివేశాల్లో నటించడం ఎంత కష్టమో నా కూడా తెలుసు. ఎంతో కష్టమైన సన్నివేశాల్లోనూ అద్భుతంగా చేయగలరు కాబట్టే ఆయనంటే నాకు చాలా ఇష్టం. మన దేశంలోని ప్రతి సంప్రదాయం మీద నాకు గౌరవం ఉంది. అలాంటప్పుడు కామెడీగా ఎందుకు చేస్తాను. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను. నా ఉద్దేశం రిషబ్‌ను కించపరచాలని కాదు అర్థం చేసుకోండి’’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ వివాదానికి కాస్త చెక్ పడినట్లు అయింది.






