- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉంటుందోనని నాకు ఆందోళనగా ఉంది.. ప్రదీప్ రంగనాథన్ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం మనం ఒక వింత ప్రపంచంలో బతుకుతున్నాం. ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు, ఎంతోమంది హీరోయిన్ల మార్ఫింగ్ ఫోటోలు కనిపిస్తున్నాయి.

దిశ, సినిమా: వరుస హిట్లతో టాలీవుడ్, కోలీవుడ్‌లో ఫుల్ జోరు మీదున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్. తను హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ విడుదలకు సిద్ధమైంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో.. చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్న ప్రదీప్, నేటి కాలంలో టెక్నాలజీ పెరుగుతున్న తీరుపై, ముఖ్యంగా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వల్ల ఎదురవుతున్న ప్రమాదాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. "ప్రస్తుతం మనం ఒక వింత ప్రపంచంలో బతుకుతున్నాం. ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు, ఎంతోమంది హీరోయిన్ల మార్ఫింగ్ ఫోటోలు కనిపిస్తున్నాయి. అవి ఎంత రియలిస్టిక్‌గా ఉంటున్నాయంటే, చూసి మనమే షాక్ అవుతున్నాం. ఇదే AI విప్లవం తెచ్చిన అనర్థం. మనం క్రమంగా వాస్తవికతకు దూరమవుతున్నాం.
ఫోటో చూసినా, వీడియో చూసినా అది నిజమో కాదో నమ్మలేకపోతున్నాం. భవిష్యత్తులో ఈ పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉంటుందోనని నాకు ఆందోళనగా ఉంది" అని ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీపై మనకున్న అతి నమ్మకంపై మాట్లాడుతూ.. "మనం ఇప్పుడు మనుషుల కంటే ఎక్కువగా చాట్‌బాట్‌లను నమ్మడం మొదలుపెట్టాం. ఇంటర్నెట్‌లో దొరికే సమాచారం అంతా నిజమేనని గుడ్డిగా నమ్ముతున్నాం. సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు అందరి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇది కేవలం 2026 నాటి పరిస్థితి మాత్రమే. మరి 2040 నాటికి ఈ టెక్నాలజీ ఎక్కడికి చేరుతుంది? రేపు మనం ఎవరిని పెళ్లి చేసుకోవాలో కూడా ఈ యంత్రాలే నిర్ణయించే స్థాయికి వస్తామేమో! సరిగ్గా ఇలాంటి అంశాల చుట్టూనే మా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా తిరుగుతుంది" అని క్లారిటీ ఇచ్చారు.






