- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీలాంటి వారి అడుగుజాడల్లో నడవడం నాకెంతో గర్వంగా ఉంది: మోహిత్ సూరి
బాలీవుడ్ డైరెక్టర్ మోహిత్ సూరి(Mohit Suri) తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘సైయారా’.

దిశ, సినిమా: బాలీవుడ్ డైరెక్టర్ మోహిత్ సూరి(Mohit Suri) తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘సైయారా’. ఇందులో అహాన్ పాండే(Ahan Pandey), అనీత్ పెద్ద(Aneeth Pedda) హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా జులై 18న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు సినీ సెలబ్రిటీలను సైతం ఫిదా అయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా బాక్సాఫీసును షేక్ చేస్తూ భారీ కలెక్షన్లు రాబడుతూ పలు రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈక్రమంలో.. తాజాగా, ‘సైయారా’ తెరకెక్కించిన డైరెక్టర్ మోహిత్ సూరి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాలీవుడ్ డైరెక్టర్ మోహిత్ సూరి(Mohit Suri) తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘సైయారా’. ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘‘సైయారాను నమ్మిన మొదటి వ్యక్తి సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) బహిరంగంగా దీనికి మద్దతు ఇచ్చి పోస్ట్ పెట్టింది కూడా ఆయనే.
నేను ఎంతో ఆరాధించే డైరెక్టర్. అతని కథలను తెరకెక్కించే విధానమంటే నాకెంతో ఇష్టం. ఆయన నుంచే స్ఫూర్తి పొందుతున్నాను. ఏ విషయాన్నైనా నిర్భయంగా చెబుతారు. దాన్ని నేను గౌరవిస్తాను. ప్రజల హృదయాలను హత్తుకునేలా సినిమాలు తీస్తారు. అందుకే ఆయన కథలకు అందరూ కనెక్ట్ అవుతారు. మీలాంటి వారి అడుగుజాడల్లో నడవడం నాకెంతో గర్వంగా ఉంది. ఎప్పటికీ మీకు అభిమానినే’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా ఫొటోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు అస్సలు ఊహించలేదని కామెంట్లు చేస్తున్నారు.






